Motor Insurance: మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ క్లెయిమ్ మళ్లీ మళ్లీ తిరస్కరణకు గురవుతుందా? ఇలా చేస్తే ఫలితం ఉంటుంది..!

|

Mar 20, 2023 | 7:10 AM

అనేక రకాల మోటారు బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి వాహనదారుడు.. తమ వాహానానికి తప్పనిసరిగా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అది వాహన భద్రతతో పాటు వ్యక్తి భద్రతకు కూడా అవసరం.

Motor Insurance: మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ క్లెయిమ్ మళ్లీ మళ్లీ తిరస్కరణకు గురవుతుందా? ఇలా చేస్తే ఫలితం ఉంటుంది..!
Follow us on

అనేక రకాల మోటారు బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి వాహనదారుడు.. తమ వాహానానికి తప్పనిసరిగా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అది వాహన భద్రతతో పాటు వ్యక్తి భద్రతకు కూడా అవసరం. వాహనం దొంగిలించబడినా, ప్రమాదం జరిగినా.. వాహన బీమా పాలసీ ఆర్థికంగా సహాయపడుతుంది. ఏదైనా జరగరానిది జరిగితే.. వెహికల్ బీమా పాలసీని క్లెయిమ్ చేయవచ్చు.

అయితే, మీ మోటారు బీమా పాలసీ పదే పదే తిరస్కరణకు గురైతే? ఏం చేయాలో అర్థంకాక తల పట్టుకుంటున్నారా? మీకోసం కొన్ని చిట్కాలు తీసుకువచ్చాడు. ఈ పద్ధతులను అనుసరించడం ద్వారా మీ వాహన బీమా పాలసీని ఈజీగా క్లెయిమ్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాహనం దొంగిలించబడినా లేదా ప్రమాదానికి గురైనా.. వెంటనే చేయవలసిన మొదటిపని బీమా కంపెనీకి తెలియజేయడం. దీంతో పాటు సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. ఆ ఫిర్యాదు కాపీని బీమా కంపెనీకి అందివ్వాలి. ఆ తరువాత, నష్టానికి సంబంధించిన సమాచారం బీమా కంపెనీ నుండి తీసుకోవడం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

CNG కిట్ గురించి కూడా సమాచారం ఇవ్వాలి..

మరమ్మతుల ఖర్చును కంపెనీ అంచనా వేస్తుంది. దీనితో పాటు, పత్రాలు, నిబంధనలు కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక మీరు కారులో CNG కిట్‌ను అమర్చినట్లయితే.. పాలసీని పునరుద్ధరించేటప్పుడు ఆ విషయాన్ని తెలియజేయాలి. బీమా సంస్థ దీని ఆధారంగా కూడా ప్రీమియం ఇస్తుంది.

మోటారు బీమా క్లెయిమ్‌ను ఎందుకు తిరస్కరించవచ్చు..

1. బీమా చేయబడిన వాహనం వ్యక్తిగతమైనదిగా ప్రకటించబడి, వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించినట్లయితే బీమా కంపెనీ సదరు క్లెయిమ్‌ను తిరస్కరిస్తుంది.

2. నిర్ణీత ప్రాంతం వెలుపల ప్రమాదం జరిగితే ఆ క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.

3. మద్యం, మాదకద్రవ్యాల ప్రభావంతో డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి గురైతే కూడా క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది.

4. క్లెయిమ్ తిరస్కరణను నివారించడానికి ముందుగా బీమా పాలసీ నిబంధనలు, షరతులను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..