Mars Transit 2025: మిథున రాశిలోకి కుజుడు.. కొత్త సంవత్సరంలో వారికి అధికార యోగం..!

Mars Transit 2025: వచ్చే ఏడాది జనవరి 22 నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు కుజుడు మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. మిథున రాశిలో సంచారం చేసే కుజుడు కొన్ని రాశులకు పదోన్నతులు కలిగించడం, అధికార యోగం పట్టించడం జరుగుతుంది. అలాగే పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధించడం, ఆశయాలను, లక్ష్యాలను నెరవేర్చడం వంటివి జరిగే అవకాశం ఉంది.

Mars Transit 2025: మిథున రాశిలోకి కుజుడు.. కొత్త సంవత్సరంలో వారికి అధికార యోగం..!
Kuja Gochar 2025
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 22, 2024 | 7:05 PM

Kuja Gochar 2025: ప్రస్తుతం కర్కాటక రాశిలో వక్రించిన కుజుడు తిరిగి మిథున రాశిలో ప్రవేశించి సుమారు 70 రోజుల పాటు అదే రాశిలో సంచారం సాగించబోతోంది. వచ్చే ఏడాది జనవరి 22 నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు కుజుడు మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. మిథున రాశిలో సంచారం చేసే కుజుడు కొన్ని రాశులకు పదోన్నతులు కలిగించడం, అధికార యోగం పట్టించడం, పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధించడం, ఆశయాలను, లక్ష్యాలను నెరవేర్చడం వంటివి జరిగే అవకాశం ఉంది. మేషం, సింహం, కన్య, తుల, ధనుస్సు, కుంభరాశుల వారికి మిథున కుజుడి వల్ల అనేక శుభ ఫలితాలు అనుభవానికి రావడం జరుగుతుంది.

  1. మేషం: రాశ్యధిపతి కుజుడు తృతీయ స్థానంలోకి ప్రవేశించడం వల్ల పట్టుదల, సాహసం, చొరవ, ధైర్యం వంటివి పెరిగే అవకాశం ఉంది. తమకు కావాల్సిన వాటిని పట్టుదలగా సాధించుకోవడం జరుగు తుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. రావలసిన సొమ్మును కొద్ది ప్రయత్నంతో రాబట్టుకుంటారు. ప్రయా ణాల వల్ల బాగా లాభముంటుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమై భూ లాభం కలుగుతుంది.
  2. సింహం: ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు లాభ స్థానంలో సంచారం ప్రారంభించడం వల్ల అనేక కష్ట నష్టాల నుంచి బయటపడే అవకాశం కలుగుతుంది. ధన సంపాదనకు కొత్త మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. సోదరులతో కూడా సమస్యలు, విభేదాలు పరిష్కారమవుతాయి. లాభదాయక పరిచ యాలు, ఒప్పందాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం పెరుగుతుంది.
  3. కన్య: ఈ రాశికి దశమ స్థానంలో కుజ సంచారం వల్ల దిగ్బల యోగం పడుతుంది. దీనివల్ల ఉద్యోగంలో అధికార లాభం, ఆదాయ లాభం కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలకు బాగా డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంత కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లవలసి వస్తుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు బాగా విస్తరిస్తాయి.
  4. తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో కుజ సంచారం వల్ల ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. విదేశాల్లో సంపాదించుకునే అవకాశం కలుగుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయ వృద్ధికి అనేక అవకాశాలు లభిస్తాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది.
  5. ధనుస్సు: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజ సంచారం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయమయ్యే అవకాశం ఉంది. ప్రేమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. గృహ, వాహన సంబంధమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. డాక్టర్లు, లాయర్లకు డిమాండ్ పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  6. కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో కుజ సంచారం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఏ ప్రయ త్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. మీ ప్రతిభకు, సమర్థతకు ఆశించిన గుర్తింపు లభి స్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమ స్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. సొంత ఇంటి కోసం ప్రయత్నాలు సాగిస్తారు. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారమై భూలాభం కలుగుతుంది.