Popcorn: సినిమా చూస్తూ పాప్‌కార్న్‌ తినేవాళ్లు ఇకపై ఓసారి ఆలోచించాల్సిందే

పాప్‌కార్న్‌పై విధిస్తున్న జీఎస్టీపై క్లారిటీ వచ్చేసింది. ముందే ప్యాక్ చేసిన, లేబుల్డ్ రెడీ 2 ఈట్ స్నాక్స్‌పై 12 శాతం GST ఉంది. క్యారమలైజ్డ్ పాప్‌కార్న్ అయితే GST 18 శాతం పరిధిలోకి వస్తుంది. ఇక ఉప్పు సహా మసాలా దినుసులతో కలిపి చేసిన రెడీ టూ ఈట్ పాప్‌కార్న్.. ముందుగా ప్యాక్, లేబుల్ చేయకుంటే అప్పుడు 5 శాతం GST పరిధిలోకి వస్తుంది.

Popcorn: సినిమా చూస్తూ పాప్‌కార్న్‌ తినేవాళ్లు ఇకపై ఓసారి ఆలోచించాల్సిందే
Popcorn
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 22, 2024 | 6:43 PM

సినిమా చూస్తూ పాప్‌కార్న్‌ తినేవాళ్లు ఇకపై ఓసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే పాప్‌కార్న్‌పై జీఎస్టీ పిడుగు పడింది. పాప్‌కార్న్‌పై మూడు రకాల జీఎస్టీ శ్లాబ్‌లు విధించడం సంచలనం రేపింది. దీంతో వినియోగదారులపై మరింత భారం పడనుంది. నిర్మలమ్మ వడ్డనతో కన్సూమర్లు, సినీ ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. ఏయే రకాల పాప్‌కార్న్‌పై ఎలాంటి జీఎస్టీ విధించారో తెలుసుకుందాం..

  • పాప్‌కార్న్‌పై మూడు రకాల జీఎస్టీ
  • లూజ్‌ పాప్‌కార్న్‌పై 5 శాతం జీఎస్టీ
  • ప్యాకేజ్డ్‌ అండ్‌ లేబుల్డ్‌ పాప్‌కార్న్‌పై 12 శాతంః
  • క్యారమెల్ పాప్‌కార్న్‌పై 18 శాతం జీఎస్టీ
  • పాప్‌కార్న్‌ ఇండస్ట్రీ వృద్ధి రేటు 10 శాతం

2030 నాటికి 12 శాతం కంటే ఎక్కువగా ఉండే చాన్స్‌ ఉంది.  ఆ సమయానికి పాప్‌కార్న్ ఇండస్ట్రీ మార్కెట్‌  రూ. 2,572 కోట్లకు చేరకుంటుంది అన్నది అంచనా. సో…మీరు సినిమా థియేటర్‌కు వెళ్తున్నారా వెళ్తే అక్కడ పాప్‌కార్న్‌ తింటే మీ జేబులకు చిల్లు పడడం ఖాయం.. ఎందుకంటే పాప్‌కార్న్‌పై మూడు రకాల జీఎస్టీని విధించింది కేంద్రం . ప్యాకెట్‌లో లేని పాప్‌కార్న్‌పై 5 శాతం జీఎస్టీ విధించారు. ప్యాకెట్‌లో వచ్చే, లేబుల్‌తో కూడిన పాప్‌కార్న్‌పై 12 శాతం GST విధించారు. పంచదారతో కలిపి తయారు చేసిన పాప్‌కార్న్‌ను 18 శాతం పన్ను శ్లాబ్‌లో ఉంచారు. పాప్‌కార్న్‌ను రుచికి అనుగుణంగా వివిధ శ్లాబ్‌లలో ఉంచింది కౌన్సిల్.

మేమేమి చేశాము నేరం అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ప్రశ్నిస్తున్నారు పాప్‌ కార్న్ ప్రియులు. వంద రూపాయల పాప్‌ కార్నర్‌కి 18శాతం జీఎస్టీ యాడ్‌ చేస్తే, అది వినియోగదారుడికి చేరేసరికి 120 అవుతుంది. ఇది దారుణం కాదా అని అడుగుతున్నారు కన్సూమర్స్. ఇక సినిమాకు వెళ్లేదెట్లా? పాప్‌కార్న్‌ తినేదెట్లా అంటూ వినియోదారులు మండిపడుతున్నారు. సామాన్యులు తినే పాప్‌కార్న్‌పై జీఎస్టీ రేట్లు పెంచడం ఏంటంటూ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి