ఇదేం క్రియేటివిటీ సామీ.. పెన్నులపై మాస్‌ కాపీయింగ్‌.. చివరకు ఏమైందంటే!

పరీక్షల్లో తప్పితే ఇంట్లో వాళ్లు కొడతారనో, తిడతారనో ఎలాగైనా పాసవ్వాలనుకుంటారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు మాస్‌ కాపీయింగ్‌కి పాల్పడుతుంటారు.

ఇదేం క్రియేటివిటీ సామీ.. పెన్నులపై మాస్‌ కాపీయింగ్‌.. చివరకు ఏమైందంటే!
Mass Copying On Pens

Updated on: Oct 13, 2022 | 6:19 PM

పరీక్షలు వచ్చాయంటే చాలు విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. పరీక్షల్లో తప్పితే ఇంట్లో వాళ్లు కొడతారనో, తిడతారనో ఎలాగైనా పాసవ్వాలనుకుంటారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు మాస్‌ కాపీయింగ్‌కి పాల్పడుతుంటారు. చిట్టీలు పెట్టుకోవడం, చేతులపై, కాళ్లపై రాసుకుని పరీక్ష హాల్‌కు వెళ్లి దొరికిపోతుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌ చల్‌ చేస్తోంది.

స్పెయిన్‌లో లా చదివే ఓ విద్యార్థి పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు తెగబడ్డాడు. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా…? కొత్తగా అనిపించకపోవచ్చు కానీ అతను ఎంచుకున్న విధానం కొత్తది. బ్లూ క్యాప్‌ ఉన్న 11 పెన్నులను తీసుకుని వాటి చుట్టూ చిన్న అక్షరాలతో జవాబులను రాసుకెళ్లాడు. పరీక్ష సమయంలో కాపీకొడుతుండగా ఉపాధ్యాయులకు దొరికిపోయాడు.

సాధారణంగా వాటిని చూస్తే పెన్నులేగా అనుకుంటాం. కానీ, కంటికి దగ్గరా పరిశీలిస్తే తప్ప వాటిపై ఉన్న అక్షరాలు మనకు కనిపించవు. విద్యార్థి మాస్‌ కాపీయింగ్‌ కోసం ఉపయోగించిన పెన్నులు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు విద్యార్థి ఆలోచన విధానాన్ని మెచ్చుకుంటున్నారు. ఇలా కూడా కాపీ కొట్టచ్చా అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.