Danger Games: వీడియో గేమ్స్‌తో గుండెపోటు.! తల్లిదండ్రులారా తస్మాత్ జాగ్రత్త.! మీ పిల్లలు స్మార్ట్ ఫోన్స్ ఎం చేస్తున్నారు.?
టెక్నాలజీ పుణ్యమా అని అరచేతిలో స్వర్గం కనిపిస్తుండటంతో స్మార్ట్ ఫోన్లకు, ల్యాప్‌టాప్‌లకు అడిక్ట్ అయిపోతున్నారు చాలామంది పిల్లలు. అయితే, ఆసక్తి రేపే ఈ గేమ్స్ అంతకు మించి ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. చిన్నారుల గుండెలయను తప్పేలా చేస్తున్నాయంటున్నారు నిపుణులు.
స్మార్ట్ ఫోన్లకు, ల్యాప్‌టాప్‌లకు అడిక్ట్ అయిపోతున్నారు చాలామంది పిల్లలు. అయితే, ఆసక్తి రేపే ఈ గేమ్స్.. అంతకు మించి ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. చిన్నారుల గుండెలయను తప్పేలా చేస్తున్నాయంటున్నారు నిపుణులు. తాజాగా ఆస్ట్రేలియన్ పరిశోధకులు చేసిన పరిశోధనలో ఇదే విషయం స్పష్టమైంది.కూర్చున్న చోటే ఆడుతున్న గేమ్స్ కదా.. వీటితో ఏంటి డేంజర్ అనుకోవడానికి లేదు. ఆట ఏదైనా ఆటే అందుకే, గెలుపోటములతో భావోద్వేగాలు అదే స్థాయిలో ఉంటాయి. గేమ్ ఓడినా, గెలిచినా విపరీతంగా ఎగ్జయిట్ అవుతుంటారు పిల్లలు. దీనివల్ల పిల్లల హార్ట్‌బీట్‌లో తేడా వస్తోంది. పర్యవసానంగా వారి ప్రాణాలే పోతున్నాయని తాజా పరిశోధనలో తేలింది. ముఖ్యంగా హృద్రోగాలున్నట్టు ముందుగా గుర్తించని పిల్లలకు ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు తాజా అధ్యయనం తేల్చింది. ఇలాంటి పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు.. ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోతుంటారనీ అది వాళ్ల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తోందని హెచ్చరించింది.
గుండె సంబంధిత సమస్యలున్న పిల్లలకే డేంజర్ అనుకోవడం పొరపాటే అవుతుంది. ఎందుకంటే, ఎలాంటి కార్డియక్ ప్రాబ్లమ్స్ లేని పిల్లలు కూడా ఈ వీడియోగేమ్స్ ఆడుతూ హార్ట్‌స్ట్రోక్‌తో చనిపోతున్నట్టు ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. గేమ్ రిజల్ట్‌తో ఉద్వేగానికి లోనవుతున్న పిల్లలు.. ఒక్కసారిగా హార్ట్‌బీట్‌లో తేడావచ్చి కుప్పకూలుతున్నట్టు తమ స్టడీలో గుర్తించారు. సాధారణంగా హార్ట్ బీట్ కరెక్టుగా లేని పిల్లల్లో ఈ వీడియో గేమ్స్.. మరింత ప్రమాదానికి కారణమవుతాయనీ హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితులు ఒక్కసారిగా గుండె ఆగిపోయేలా చేస్తాయంటున్నారు. ఆస్ట్రేలియాలోని ది హార్ట్ సెంటర్ ఫర్ చిల్డ్రన్ పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. వీడియో గేమ్స్ ఆడుతూ స్పృహ తప్పిపడిపోయిన పిల్లల్ని నిర్లక్ష్యం చేయకూడదనీ తప్పనిసరిగా వారికి గుండె సంబంధిత పరీక్షలు చేయించాలని సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..