Pan Card: పాన్‌కార్డు నంబర్‌లోని 4, 5 అక్షరాల్లో మీ పూర్తి సమాచారం ఉంటుందని మీకు తెలుసా?

|

Sep 04, 2021 | 2:13 PM

మీకు పాన్ కార్డ్ ఉందా ? అయితే అందులో ఉన్న నంబర్లకు అర్థం ఏంటా అని ఎప్పుడైనా తెలుసుకున్నారా ? గమనించి ఉండరు కదా..

Pan Card: పాన్‌కార్డు నంబర్‌లోని 4, 5 అక్షరాల్లో మీ పూర్తి సమాచారం ఉంటుందని మీకు తెలుసా?
Pan Card
Follow us on

మీకు పాన్ కార్డ్ ఉందా ? అయితే అందులో ఉన్న నంబర్లకు అర్థం ఏంటా అని ఎప్పుడైనా తెలుసుకున్నారా ? గమనించి ఉండరు కదా.. అందులో నంబర్లతోపాటు.. ఇంగ్లీష్ లెటర్స్ కూడా ఉంటాయి. అయితే అవి ఎందుకు అలా ఉంటాయో ఎప్పుడైనా తెలుసుకున్నారా ? చాలామంది ఈ విషయాలను పెద్దగా పట్టించుకోరు. అందులో ఉండే.. ఆ పది నంబర్లను కేటాయించడం వెనుక ఉన్న అసలు కారణం తెలిస్తే షాకవుతారు. ఎందుకంటే.. ఆ నంబర్లలో మీకు సంబంధించిన సమాచారం ఉంటుంది. మరి ఆ వివరాలు ఎంటో తెలుసుకుందామా.

యుటీై లేదా ఎన్ఎస్డీఎల్ ద్వారా ఒక క్రమంలో పాన్ కార్డువు వ్యక్తులకు ఆదాయ పన్ను శాఖ జారీ చేస్తుంది. అయితే మీ ఫోన్ మాదిరిగా పాన్ నంబర్ కంప్యూటర్ జనరేటెడ్ కాదు. కార్డుపై 10 అంకెలు, అక్షరాలు కలిపి ఉంటాయి. మొదటి ఐదు ఇంగ్లీష్ అక్షరాలు, ఆ తర్వాతి నాలుగు అంకెలు, చివరిలో ఒక అక్షరం ఉంటుంది. అయతి ఒక్కోసారి ఇంగ్లీష్ అక్షరం సున్నా ‘O’, సున్నా ‘0’ (జీరో)కి మ‌ధ్య వ్యత్యాసాన్ని గుర్తుప‌ట్టక‌పోవ‌చ్చు. అలాగే పాన్ కార్డులో ఉండే అక్షరాలు ఆదాయ పన్ను శాఖ దృష్టిలో ఏంటీ అనేది చెప్తుంది. నాలుగో అక్షరం ఆదాయప‌న్ను శాఖ దృష్టిలో మీరు ఏంటన్నది తెలుపుతోంది. ఉదాహరణకు నాలుగో అక్షరం ‘P’ అని ఉంటే.. మీరు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుడని అర్థం. అలాగే C- కంపెనీ, H-హిందూ అవిభాజ్య కుటుంబం, A-వ్యక్తులు లేదా సంస్థల‌ బృందం, B-వ్యక్తుల బృందం, G-ప్రభుత్వ ఏజెన్సీ, J-తాత్కాలిక న్యాయ‌వ్యవస్థ, L-స్థానిక అధికారిక కేంద్రం, F -సంస్థ, T-ట్రస్ట్‌. ఇక ఐదో అక్షరం మీ ఇంటి పేరులోని మొదటి అక్షరాన్ని తెలుపుతోంది. వ్యక్తులు కాకుండా ఇత‌రులు అయితే పాన్ కార్డు హోల్డర్ పేరులోని మొద‌టి అక్షరం ఉంటుంది. ఆ తర్వాత నాలుగు నంబర్లు 0001 నుంచి 9999 మధ్య ఉంటాయి. చివ‌రి సంఖ్య ఎప్పుడూ అక్షరమే ఉంటుంది.

Also Read: Kangana Ranut: జయలలితను తలపించిన కంగనా రనౌత్.. దివంగత ముఖ్యమంత్రి మెమొరియల్ ఘాట్‍కి వెళ్లిన క్వీన్..

Baker & Beauty Glimpse: భిన్నమైన రెండు మనసులు ఒకటి అయితే ? .. ఆద్యంతం ఆకట్టుకుంటున్న ది బ్యూటీ అండ్ ది బ్యూటీ గ్లింప్స్..