Mosquito Facts: అలాంటి వారంటే దోమలకు ఎంతో ఇష్టమంట.. వాటి బారి నుంచి తప్పించుకోండి ఇలా..

|

Apr 29, 2022 | 1:56 PM

Mosquito Facts: వేసవి వచ్చిందంటే కరెంటు కష్టాలు ఎక్కువవుతున్నాయి. వేడి నుంచి తప్పించుకోవడానికి మనం ఇళ్లలో కిటికీని తెరుస్తుంటాము. ఇవి కొందరిని మాత్రమే ఎందుకు కుడతాయో ఇప్పుడు తెలుసుకోండి..

Mosquito Facts: అలాంటి వారంటే దోమలకు ఎంతో ఇష్టమంట.. వాటి బారి నుంచి తప్పించుకోండి ఇలా..
Mosquitos
Follow us on

Mosquito Facts: వేసవి వచ్చిందంటే కరెంటు కష్టాలు ఎక్కువవుతున్నాయి. వేడి నుంచి తప్పించుకోవడానికి మనం ఇళ్లలో కిటికీని తెరుస్తుంటాము. లేదా బిల్డింగ్ పై పడుకుంటాము. సాయంత్రం మీరు ఇంటి కిటికీ తెరిచినప్పుడు, దోమల నెమ్మదిగా గదిలోకి ప్రవేశిస్తుంటాయి. ఆపై అవకాశం దొరకగానే ఇంట్లోని వారిపై దాడి మొదలుపెడతాయి. అటువంటి పరిస్థితిలో దోమలు కుట్టడం ఇబ్బంది కలిగిస్తుంది. దోమల నుంచి రక్షణ తప్పనిసరి.. లేకుంటే అనేక రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది.

దోమల నుంచి తప్పించుకోవటానికి ఇంటి చిట్కాలు..

కర్పూరం– రాత్రిపూట దోమలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే కర్పూరాన్ని వాడండి. మీ గదిలో కర్పూరం వెలిగించి 15-20 నిమిషాలు వదిలివేయండి. కొద్దిసేపటికి దోమలు పారిపోతాయి.

వేపనూనె– దోమల నుంచి తప్పిచుకునేందుకు వేపనూనె ఉపయోగించవచ్చు. వేప, కొబ్బరి నూనె సమాన పరిమాణంలో కలపండి. దీన్ని మీ శరీరంపై రాసుకోండి. దీనిని రాసుకున్న తరువాత దాదాపు 8 గంటల పాటు మీకు దోమల నుంచి రక్షణ లభిస్తుంది.

యూకలిప్టస్ నూనె– పగటిపూట దోమలు కుడుతున్నట్లయితే.. యూకలిప్టస్ నూనెను ఉపయోగించవచ్చు. సమాన పరిమాణంలో యూకలిప్టస్, నిమ్మరసం కలిపి శరీరానికి అప్లై చేయాలి. దీని వాసనతో దోమలు మీ దగ్గరికి కూడా రావు.

వెల్లుల్లి– వెల్లుల్లిని ఉపయోగించడం వల్ల ఇంట్లోకి దోమలు ప్రవేశించవు. ముందుగా వెల్లుల్లిపాయలను మెత్తగా నూరి నీళ్లలో మరిగించాలి. ఇంట్లోని ప్రతి మూలలో ఈ నీటిని చల్లాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోకి దోమలు ప్రవేశించవు.

లావెండర్– లావెండర్ చాలా బలమైన సువాసన కలిగి ఉంటుంది. దీనివల్ల దోమలు చుట్టుపక్కలకు కూడా రావు. మీరు ఇంట్లో లావెండర్‌తో రూమ్ ఫ్రెషనర్‌ను ఇందుకోసం వాడుకోవచ్చు.

దోమలు మిమ్మల్ని ఎందుకు కుడతాయో తెలుసా..

ఆడ దోమలు మాత్రమే మనుషులను కుట్టి రక్తాన్ని తాగుతాయి. ఎందుకంటే.. వాటి జనాభాను పెంచుకునేందుకు అవి గుడ్లు తయారు చేయాలి. ఈ గుడ్లకు మానవ రక్తంలో ఉండే పోషకాలు చాలా అవసరం. ఒక ఆడ దోమ ఒకేసారి 30 నుంచి 300 గుడ్లు పెడుతుంది. మళ్లీ అదే సంఖ్యలో గుడ్లు పెట్టేందుకు మళ్లీ మానవ రక్తాన్ని తాగాలి. అందుకే దోమలు మనుషుల రక్తాన్ని పీలుస్తుంటాయి.

దోమలు కొందరినే ఎందుకు కుడతాయంటే..

ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరం నుంచి కార్బన్ డయాక్సైడ్ బయటకు వస్తుంది. కార్బన్ డయాక్సైడ్ వాసన ద్వారా దోమలు చాలా త్వరగా మనుషుల వైపు ఆకర్షితులవుతాయి. ఆడ దోమ తన ‘సెన్సింగ్ ఆర్గాన్స్’ ద్వారా కార్బన్ డై ఆక్సైడ్ వాసనను గుర్తిస్తాయి. ఇవి గర్భిణీ స్త్రీలను ఇతరులకన్నా ఎక్కువగా కుడతాయి. ఎందుకంటే.. గర్భిణీ స్త్రీలు సాధారణ మానవుల కంటే 20% ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తారు. వీటికి తోడు సాధారణ వ్యక్తుల కంటే ‘O’ ; ‘A’ బ్లడ్ గ్రూప్‌లు ఉన్న వారిని ఎక్కువగా కుడతాయని జపాన్ పరిశోధకులు తెలిపారు. వారి రక్తంలో ఉండే కొన్ని రకాల పదార్థాలు దోమలను ఎక్కువగా ఆకర్షిస్తాయని తేలింది. మానవ చెమట దోమలను ఎక్కువగా ఆకర్షిస్తుంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే బీర్ తాగే వారి రక్తం అంటే దోమలకు ఎక్కువ ఇష్టమని ఫ్రాన్స్‌కు చెందిన ఐఆర్‌డి రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. దోమల వల్ల మలేరియా, చికెన్ గునియా, ఎల్లో ఫీవర్, డెంగ్యూ వంటి అనేక ప్రమాదకర జబ్బులు మిలియన్ల మంది ప్రాణాలను హరిస్తున్నాయి.

దోమకాటు వల్ల ఎందుకు దురద పుడుతుందంటే..

దోమ మిమ్మల్ని కుట్టినప్పుడు అది తన లాలాజలాన్ని శరీరంలోకి విడుదల చేస్తుంది. మానవ శరీరానికి దాని సొంత రోగనిరోధక వ్యవస్థ ఉంది.. ఇది లోపలికి వచ్చే వాటిపై ప్రతిస్పందిస్తుంది. మీ శరీరం దోమల లాలాజలాన్ని రసాయనంగా గుర్తిస్తుంది. అందువల్ల రోగనిరోధక వ్యవస్థ వెంటనే దానిని శరీరం నుంచి బయటకు తీయాలని నిర్ణయించుకుంటుంది. మెదడుకు ఈ సందేశాన్ని పంపుతుంది. ఈ ప్రతిచర్య దురదకు కారణమవుతుంది.

ఇవీ చదవండి..

Business: వ్యాపారంలో సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ అంటే ఏమిటో తెలుసా.. ఎందుకు ముఖ్యమైనదంటే..

EV fire: ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌ ప్రమాదాలపై కేంద్రం ఫోకస్.. కొత్త మోడల్స్ లాంచింగ్‌పై నిషేధం