King Cobra: కోబ్రాతో గేమ్స్ డేంజర్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పాము వీడియో..

King Cobra: ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాములలో కింగ్ కోబ్రా ఒకటి. అది కాటు వేసిందంటే ఇక అంతే సంగతులు.

King Cobra: కోబ్రాతో గేమ్స్ డేంజర్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పాము వీడియో..

Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 14, 2021 | 12:39 PM

King Cobra: ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాములలో కింగ్ కోబ్రా ఒకటి. అది కాటు వేసిందంటే ఇక అంతే సంగతులు. అలాంటి పామును పట్టుకోవడానికి ఇద్దరు వ్యక్తులు సాహసం చేశారనే చెప్పవచ్చు. ఈ వీడియో చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

కింగ్ కోబ్రాను పట్టుకోవడానికి వచ్చిన ఓ వ్యక్తి కాలువలో పడిపోయిన ఓ దుంగపై నిలుచొని ఉంటాడు. అతడికి సాయం చేయడానికి మరో వ్యక్తి కూడా వస్తాడు. మొదటి వ్యక్తి కర్రతో పామును పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే పాము అతడిపై దాడి చేస్తుంది. అయితే పెద్ద సైజులో ఉన్న కింగ్ కోబ్రాను అదుపుచేయడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ కుదరకపోవడంతో భయపడి నీటిలో పడిపోతాడు. ఇంతలో మరో వ్యక్తి వచ్చి అతడికి సాయం చేస్తాడు. చివరికి కింగ్ కోబ్రాను పట్టుకొని విజయం సాధిస్తాడు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, డేంజర్ అంటూ పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.