ఐడియా అదుర్స్.. మొక్కజొన్న పంటను కాపాడుకోడానికి రైతన్నల క్రేజీ ప్లాన్స్.. ఏం చేస్తున్నారంటే..

|

Feb 19, 2021 | 3:02 PM

పంటను పశుపక్ష్యాదుల నుంచి రక్షించుకోవడానికి రైతులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది అన్నదాతలు వినూత్న పద్ధతులు అనుసరిస్తుంటారు...

ఐడియా అదుర్స్.. మొక్కజొన్న పంటను కాపాడుకోడానికి రైతన్నల క్రేజీ ప్లాన్స్.. ఏం చేస్తున్నారంటే..
Follow us on

పంటను పశుపక్ష్యాదుల నుంచి రక్షించుకోవడానికి రైతులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది అన్నదాతలు వినూత్న పద్ధతులు అనుసరిస్తుంటారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా రైతులు… అడవి పందుల బారి నుండి తమను పంటలను రక్షించుకోవడానికి.. సరికొత్త ప్లాన్‌ చేశారు. ఖమ్మం జిల్లా బోనకల్, ముష్టికుంట్ల గ్రామాల్లో రైతులు..అడవి పందుల బారి నుంచి పంటలను రక్షించుకేనేందుకు నానా తంటాలు పడతున్నారు. అనేక ప్రయాసలుపడి సాగుబడి చేస్తే…పంట చేతికొచ్చే సమయానికి అడవి పందులు, కోతులు దాడిచేసి..పంటలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పటం లేదు.

అడవి పందులు ఎదురుపడితే ప్రాణానికి నష్టమని భావించిన రైతులు… వాటిని భయపెట్టి పంటను కాపాడుకోవడానికి  పొలాల్లో మైకులు ఏర్పాటు చేశారు. మెమరీ కార్డులో పులి, కుక్క, నక్క అరుపుల శబ్దాలను రికార్డ్ చేసుకొని పగలు, రాత్రి సమయాల్లో ప్లే చేస్తున్నారు. దీంతో కోతులు, అడవి పందులు అటు వైపు వచ్చినా ఆ శబ్ధాలకు భయపడి అవి పారిపోతున్నాయి.

మరికొంతమంది రైతులు.. జంతువుల డ్రెస్సులు వేసుకుని..పొలాల్లో తిరుగుతూ కాపలా కాస్తున్నారు. రాత్రి సమయాల్లో అడవి పందుల బెడద ఎక్కువగా ఉండటంతో… రాత్రుళ్ళు కూడా పంట పొలాల్లోని ఉండి కాపలా కాయాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు వాపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పంటలను కాపాడుకోవాల్సిన దుస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

ఈసారి ఐపీఎల్‌లో కడప కుర్రాడి ఖలేజా.. దక్కించుకున్న సీఎస్‌కే..’ల్యాండ్ ఆఫ్ బాహుబలి’ అంటూ

వాట్సాప్ ప్రైవసీ పాలసీపై సంస్థ సరికొత్త ప్రచారం.. కొత్త డెడ్‌లైన్ ఇదే..!