AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onions: భారత్‌లోని ఆ నగరంలో ఉల్లిపాయలు నిషేధం.. ఎందుకో తెలుసా..?

దేశంలో ఆహార అలవాట్లు రాష్ట్రం నుండి రాష్ట్రానికి విస్తృతంగా మారుతూ ఉంటాయి. ఇది దేశ సాంస్కృతిక వైవిధ్యం, దేశం యొక్క భౌగోళికం, వాతావరణం, స్థానిక, ప్రాంతీయ, కాలానుగుణ ఆహార ఉత్పత్తుల లభ్యతను ప్రతిబింబిస్తుంది. దేశంలోని ఓ నగరంలో మాత్రం ఉల్లిపాయలు, వెల్లుల్లిని నిషేధించారు. ఎందుకు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Onions: భారత్‌లోని ఆ నగరంలో ఉల్లిపాయలు నిషేధం.. ఎందుకో తెలుసా..?
Katra's Ban On Onion And Garlic
Krishna S
|

Updated on: Sep 06, 2025 | 9:09 PM

Share

సాధారణంగా భారతీయ వంటల్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి చాలా ముఖ్యమైన పదార్థాలు. అయితే దేశంలో ఒక ప్రత్యేకమైన నగరం ఉంది. అక్కడ ఉల్లిపాయలు, వెల్లుల్లిని పండించడం, అమ్మడం తినడం పూర్తిగా నిషేధం. ఆ నగరమే జమ్మూకశ్మీర్‌లోని కత్రా. ఇది దేశంలో ఉల్లిపాయలు, వెల్లుల్లిని పూర్తిగా నిషేధించిన ఏకైక నగరం. ఈ నగరంలోని కూరగాయల మార్కెట్లలో లేదా కిరాణా దుకాణాలలో ఉల్లిపాయలు దొరకవు. హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా వీటితో వండిన ఆహారం ఉండదు. కానీ దీనికి ఒక బలమైన కారణం ఉంది.

నిషేధానికి కారణం ఇదే

కత్రా నగరం పవిత్రమైన మాతా వైష్ణో దేవి ఆలయానికి ప్రధాన ద్వారం. ఈ ఆలయం పర్వతాలపై దాదాపు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. వైష్ణో దేవి భక్తులు ఈ నగరం గుండానే ప్రయాణిస్తారు. ఈ ప్రదేశం యొక్క పవిత్రతను కాపాడటానికి.. ఉల్లిపాయలు, వెల్లుల్లిని ఇక్కడ పూర్తిగా నిషేధించారు. హిందూ తత్వశాస్త్రం ప్రకారం.. ఉల్లిపాయలు, వెల్లుల్లిని తామసిక ఆహారాలుగా పరిగణిస్తారు. వీటిని తినడం వల్ల సోమరితనం, కోపం, ప్రతికూల భావాలు పెరుగుతాయని నమ్ముతారు.

పూజలు, ఉపవాసాలు లేదా ఇతర మతపరమైన కార్యక్రమాలు చేసేటప్పుడు ఈ ఆహారాలను తినకూడదని చెబుతారు. మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే భక్తులు సాత్వికమైన వాతావరణంలో ఉండాలనే ఉద్దేశంతో కత్రాలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకపోయినా ఇక్కడ ఆహారం చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ లభించే సాత్విక ఆహారం రుచి, పోషకాలతో నిండి ఉంటుంది. కత్రా కేవలం మాతా వైష్ణో దేవి ఆలయానికి ఒక ప్రవేశ ద్వారం మాత్రమే కాదు.. ఇది ఆధ్యాత్మిక విశ్వాసం, క్రమశిక్షణకు ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు