Organ donation: ఊపిరి పోయినా ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు

|

Sep 27, 2021 | 9:01 AM

అప్పటివరకు బాగానే ఉన్నాడు. అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో ఊహించని విషాదం చోటుచేసుకుంది.

Organ donation: ఊపిరి పోయినా ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు
Organ Donation
Follow us on

డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కొరకు హైదరాబాద్ లో ఉంటూ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమవారం పేట గ్రామానికి చెందిన బానోత్ వెంకట్. ఆరోగ్యం బాగానే వుంది కానీ.. గత వారం క్రితం కళ్ళు తిరిగి రూంలో పడిపోయాడు. వెంకట్‌ను వెంటనే హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కి తరలించారు ఫ్రెండ్స్. అన్నీ రకాల టెస్ట్ లు చేశాక తెలిదేమిటంటే.. తలలో గాయమై బ్రెయిన్ లో బ్లడ్ ప్లాట్ అయిందని డాక్టర్లు తెలిపారు. యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు బానోత్ వెంకట్. ఈ విషాద వార్తను బానోత్ వెంకట్ తల్లిదండ్రులకు తెలియడంతో.. కన్నీరు మున్నీరయ్యారు. కొడుక లేడన్న ఆవేదనలో కూడా అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు వెంకట్ తల్లిదండ్రులు.

కొడుకు అవయవాలు.. కిడ్నీలు, కాలేయం, కళ్ళు దానం చేసి ఐదుగురి జీవితాల్లో కొత్త జీవితాన్ని నింపారు. వాటిని పలువురు బాధితులకు అమర్చారు వైద్యులు. జోహార్ బానోత్ వెంకట్ అంటూ యశోద హాస్పిటల్ యాజమన్యం, సిబ్బంది సైల్యుట్ చేసి గౌరవ వందనాలతో సాగనంపారు. వెంకట్ తల్లి తండ్రుల త్యాగం చాలా  గొప్పది అని పలువురు ప్రశంసించారు. వెంకట్ మృతి చెందాక కూడా మరో ఐదుగురికి కొత్త జీవితాలను ఇవ్వడంతో.. వెంకట్, వెంకట్ తల్లిదండ్రలను కొనియాడారు సోమారంపేట్ గ్రామస్తులు.

 

Also Read: అనంతపురం జిల్లాలో బంగారం నిక్షేపాలు.. టన్ను మట్టి తవ్వితీస్తే 4 గ్రాముల గోల్డ్

నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. కానీ