Two Heads Baby: అప్పుడే పుట్టిన బిడ్డను వదిలి పారిపోయిన తల్లిదండ్రులు.. అసలు కారణం తెలిస్తే షాక్!

|

Nov 25, 2021 | 5:31 PM

రక్తం పంచుకుని, పేగు తెంచుకుని పుట్టిన బిడ్డపై మమకారం చంపుకుంది. పుట్టిన అరగంటకే ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోయింది. ఆ పసికందు కళ్లు తెరిచేలోపే అనాథగా మారింది.

Two Heads Baby: అప్పుడే పుట్టిన బిడ్డను వదిలి పారిపోయిన తల్లిదండ్రులు.. అసలు కారణం తెలిస్తే షాక్!
Ranchi Rims Hospital
Follow us on

Baby Born with Two Heads in Jharkhand: రక్తం పంచుకుని, పేగు తెంచుకుని పుట్టిన బిడ్డపై మమకారం చంపుకుంది. పుట్టిన అరగంటకే ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోయింది. ఆ పసికందు కళ్లు తెరిచేలోపే అనాథగా మారింది. ఆకలితో ఏడుస్తూ బిక్కచూపులు చూస్తున్న నవజాత శిశువు ఆలనాపాలనా చూసేవారే లేకుండాపోయారు. ఈ ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలోని రిమ్స్‌ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన బిడ్డను వదిలి తల్లిదండ్రులు పారిపోయారు. నవజాత శిశువు ఆసుపత్రిలోనే వదిలి వెళ్లారు. అయితే, ఆ నవజాత శిశువుకు రెండు తలలు పుట్టినట్లు, తలవంటి వ్యాధితో చిన్నారి బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో అతనికి జన్మనిచ్చిన తల్లి కూడా కరుణించక అతడిని వదిలేసి వెళ్లిపోయింది.

కాగా, ఈ ఘటనకు సంబంధించి ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తల్లిదండ్రుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అయితే, వారు ఆసుపత్రిలో నమోదు చేసిన చిరునామా నకిలీదని తేలింది. కాగా, తమ బిడ్డ మామూలుగా ఉండబోదనే ఆలోచన వారికి ముందే వచ్చి ఉండవచ్చు. లేదంటే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పారిపోవాల్సిందేనని ముందే నిర్ణయించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పాప పుట్టిన తర్వాత చిన్నారిని నియోనాటల్ ఐసీయూలో చేర్చడంతో కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. అయితే, చిన్నారిని రక్షించే బాధ్యతను వైద్యులు తీసుకున్నారు.

దీంతో చిన్నారి ఒంటరిగా ఉండడంతో రిమ్స్ యాజమాన్యం సీడబ్ల్యూసీకి సమాచారం అందించింది. సిడబ్ల్యుసి ద్వారా తెలియడంతో, కరుణ సంస్థ ప్రజలు చిన్నారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అక్కడే ఉన్న వైద్యుడు దేవేష్ స్వయంగా ముందుకు వచ్చి చిన్నారికి రక్తదానం చేశారు. ప్రస్తుతం శిశువు పరిస్థితి మెరుగుపడినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. శిశువును నియోనాటల్ నుండి న్యూరో సర్జరీ విభాగానికి పంపారు. మొదట్లో కొన్ని రోజులు ఆగిన తర్వాత సర్జరీ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. ఇదిలావుంటే, శిశువు కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేసి కరుణ ఎన్‌ఎంఓ ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఆ బిడ్డకు 15 రోజుల వయస్సు వచ్చినప్పుడు, ఆపరేషన్ కోసం రిమ్స్‌లోని న్యూరో సర్జరీ విభాగానికి తీసుకువచ్చారు. చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత మళ్లీ చిన్నారిని కరుణా ఆశ్రమానికి తీసుకెళ్లనున్నట్లు వైద్యులు వెల్లడించారు. రాంచీకి చెందిన పలువురు సీనియర్ వైద్యులు కలిసి ఈ సంస్థను నిర్వహిస్తున్నారు.

చిన్నారికి పుట్టుకతో ఈ వ్యాధి ఉందని రిమ్స్‌లోని న్యూరో సర్జరీ విభాగం డాక్టర్ సిబి సహాయ్ తెలిపారు. ఈ వ్యాధిలో మెదడులోని తల వెనుక భాగం సీఎస్ ఎఫ్ బయటకు వచ్చి సంచిలాగా మారుతుంది. ఇది ఖచ్చితంగా తలలాగే కనిపిస్తుంది. వైద్య భాషలో దీనిని ఆక్సిపిటల్ మెనింగో ఎన్సెఫలోసెల్ అంటారు. వైద్యుల బృందం కలిసి రెండు గంటలపాటు ఆపరేషన్ చేసిందని సహాయ్ చెప్పారు. ఆ తర్వాత చిన్నారిని నిశితంగా పరిశీలించి చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం శిశువు పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సహాయ్ పేర్కొన్నారు.

Read Also…  Coal Mine Accident: సైబీరియా బొగ్గు గనిలో ఘోర ప్రమాదం.. 11మంది మృతి, పదుల సంఖ్యలో గల్లంతు!