Monsoon Tips: వర్షాకాలంలో ఇలాంటి బట్టలు అస్సలు వేసుకోకపోవడమే బెటర్!!

|

Jul 29, 2023 | 12:23 PM

ఈ సీజన్ లో కామన్ గా జలుబు, దగ్గు, జ్వరం, చర్మ వ్యాధులు ఇలా చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి. ఈ వర్షాకాలంలో ముఖ్యంగా బట్టల విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. బయటికి వెళ్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ బట్టలు వేసుకోవాలి? ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా..

Monsoon Tips: వర్షాకాలంలో ఇలాంటి బట్టలు అస్సలు వేసుకోకపోవడమే బెటర్!!
Monsoon Tips
Follow us on

వర్షాకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్త అవసరం. లేదంటూ జబ్బుల బారిన పడాల్సిందే. వర్షాకాలంలో తేమగా ఉంటుంది కాబట్టి.. బ్యాక్టీరియా చాలా ఫాస్ట్ గా వ్యాప్తి చెందుతుంది. ఈ సీజన్ లో కామన్ గా జలుబు, దగ్గు, జ్వరం, చర్మ వ్యాధులు ఇలా చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి. ఈ వర్షాకాలంలో ముఖ్యంగా బట్టల విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. బయటికి వెళ్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ బట్టలు వేసుకోవాలి? ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. మరి ఆ జాగ్రత్తలేంటో తెలుసుకుందామా.

-సాధారణంగా మిగతా వాతావరణంలో వేసుకునే బట్టలు వర్షాకాలంలో సరిపోవు. కాబట్టి ఈ సీజన్ లో రాజీ పడకుండా మీకు కంఫర్ట్ గా ఉండే బట్టలనే వేసుకోవాలి.

-మందంగా లేక బిగుతుగా ఉన్న బట్టలు కాకుండా సన్నగా వదులుగా ఉండే బట్టలని వేసుకోవాలి. వర్షంలో ఈ బట్టలు తడిచిన కూడా త్వరగా ఆరిపోతాయి. దీని వల్ల మన బాడీకి ఎలాంటి సమస్యలు ఉండవు.

ఇవి కూడా చదవండి

-అలాగే లూజ్ గా ఉండే ప్యాంట్స్, టీ షర్ట్స్, లైట్ వెయిట్ గా ఉండే బట్టలు వేసుకోవచ్చు. పాలిస్టర్ బట్టలు అయితే ఈ టైమ్ లో బెస్ట్ అని చెప్పవచ్చు.

-ఈ వానాకాలంలో ఆడవారు చీరలు, చుడీదార్స్, కుర్తలు వేసుకోకపోవడమే మంచింది. ఎందుకంటే బయటకు వెళ్లినప్పుడు ఈ బట్టలపై బురదపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

-ఏ కాలంలో అయినా ఆడ, మగ అనే తేడా లేకుండా చాలా మంది జీన్స్ ని ఇష్టపడతారు. జీన్స్ ని ఎప్పుడైనా, ఎక్కడైనా వేసుకుంటారు. కానీ ఈ రెయినీ సీజన్ లో వేసుకోకపోవడమే మంచిది. ఇవి ఆరడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఈ కాలంలో ప్రిఫర్ చేయకపోవడమే బెటర్.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..