Knowledge: ప్యాసింజర్‌ రైళ్లలో 24 కోచ్‌లుంటే.. గూడ్స్‌ రైళ్లలో 50 కంటే ఎక్కువ కోచ్‌లు ఎందుకుంటాయో తెలుసా?

|

Feb 19, 2022 | 10:54 AM

ప్యాసింజర్ రైళ్లతో పోలిస్తే, గూడ్స్ రైళ్లు (goods trains)చాలా పొడవుగా (length of the train) ఉంటాయనే విషయం మీరెప్పుడైనా గమనించారా? అంతేకాకుండా ప్యాసింజర్ రైళ్లలో తక్కువ కోచ్‌లు ఉంటాయి. అదే గూడ్స్ రైళ్లకైతే ఎక్కువ కోచ్‌లు ఉంటాయి..

Knowledge: ప్యాసింజర్‌ రైళ్లలో 24 కోచ్‌లుంటే.. గూడ్స్‌ రైళ్లలో 50 కంటే ఎక్కువ కోచ్‌లు ఎందుకుంటాయో తెలుసా?
Trains
Follow us on

Difference between Passenger train and Goods train: ఈ రోజుల్లో రైలు ప్రయాణాలు చేయనివారుండరంటే అతిశయోక్తి కాదేమో! ఇక మనం ఎక్కాల్సిన రైలు ఎప్పుడోగానీ టైంకు రాదు. దాదాపుగా రైల్వే ట్రాక్‌పైకి రావల్సిన సమయంకంటే కొంచెం లేటుగానే వస్తాయి. ఐతే రైల్వే స్టేషన్‌లో మీరు వచ్చే, పోయే రైళ్లను చాలాసార్లు గమనించి ఉంటారు. వాటిల్లో ప్యాసింజర్‌, సూపర్‌ ఫాస్ట్‌, గూడ్స్‌ రైళ్లు ఇలా రకరకాలుంటాయి. ఐతే ప్యాసింజర్ రైళ్లతో పోలిస్తే, గూడ్స్ రైళ్లు (goods trains)చాలా పొడవుగా (length of the train) ఉంటాయనే విషయం మీరెప్పుడైనా గమనించారా? అంతేకాకుండా ప్యాసింజర్ రైళ్లలో తక్కువ కోచ్‌లు ఉంటాయి. అదే గూడ్స్ రైళ్లకైతే ఎక్కువ కోచ్‌లు ఉంటాయి. ఎందుకు ఈ వ్యత్యాసమనే సందేహం కూడా మీకు వచ్చివుంటుంది? మీ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా ఇండియన్‌ ట్రైన్ల పొడవు, రైల్వే ప్లాట్‌ఫారమ్ పొడవుపై ఆధారపడి ఉంటుంది. అందుకే ప్లాట్‌ ఫారమ్‌ (Railway platform) ప్రారంభమైన ప్రదేశంలో రైలు ఆగుతుంది. ప్లాట్‌ ఫారమ్‌ పొడవును లూప్ లైన్ అని అంటారు. రైలు పొడవు – లూప్ లైన్ (loop line) పొడవును మించకూడదన్నమాట. ఇక ప్లాట్‌ఫారమ్‌పై ఆగే రైళ్లు లూప్‌లైన్‌లో సరిపోతాయి. అప్పుడు మాత్రమే మెయిన్‌లైన్‌కు చేరుకునే ఇతర రైలు సౌకర్యవంతంగా ప్రయాణించగలదు. ప్రమాదాలు జరగకుండా నివరించడంలోనూ ఇది బాగా పనిచేస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రైలులోని అన్ని కోచ్‌లు ప్లాట్‌ఫారమ్‌పై సులభంగా చేరుకోవడానికి వీలుగా ప్లాట్‌ఫారమ్ కంటే పొడవుగా కోచ్‌లు ఉండకుండా జాగ్రత్త పడతారు.

ఇక మన దేశ రైల్వేల్లో, లూప్ లైన్ ప్రామాణిక పొడవు సుమారు 650 మీటర్లు ఉంటుంది. రైలు పొడవు కూడా 650 మీటర్లకు మించకుండా ఉంటుంది. ప్రతి కోచ్ పొడవు దాదాపు 25 మీటర్లు ఉంటుంద. దీని కారణంగా గరిష్టంగా 24 కోచ్‌లు, ఒక ఇంజన్‌తో కలిపి మొత్తం 650 మీటర్ల పొడవుతో రైలు ఉంటుంది. అందుకే.. ప్యాసింజర్ రైళ్లలో గరిష్టంగా 24 కోచ్‌లు ఉంటాయి.

గూడ్స్ రైళ్లు ఎందుకు అత్యంత పొడవుగా ఉంటాయంటే..
గూడ్స్ రైళ్లు ప్రతి ప్యాసింజర్ ప్లాట్‌ఫారమ్‌పై ఆగవు. సెలెక్టెడ్‌ స్టేషన్లలో మాత్రమే అవి ఆగుతాయి. అంటే.. రవాణా సరుకును లోడ్‌ చేయడానికి, అన్‌లోడ్ చేయడానికి సౌకర్యంగా ఉండే చోట ఆగుతాయన్నమాట. ఆయా స్టేషన్లలో కూడా.. రైలు పొడవు, లూప్ లైన్ పొడవును మించకూడదు. కానీ గూడ్స్ రైలు, BOX, BOXN, BOXN-HL.. వీటికి సంబంధించిన వ్యాగన్ల పొడవు దాదాపు 11 నుంచి 15 మీటర్ల వరకు ఉంటుంది. వ్యాగన్ బాక్సుల పొడవును బట్టి, గూడ్స్‌ రైలుకు గరిష్టంగా 40 నుంచి 58 వరకు వ్యాగన్ బాక్సులుంటాయి.

Also Read:

SSC CHSL 2021కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ముఖ్యమైన ప్రకటన! వెంటనే ప్రారంభించండి..