Indian Railways: రైళ్లకు గ్రీన్, బ్లూ, రెడ్ కలర్స్ కోచ్‌లే ఏందుకు ఉంటాయి? అసలు రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

దేశ వ్యాప్తంగా చాలా మంది రైలు ప్రయాణాలకు ఇష్టపడుతారు. సుదూర ప్రయాణాలన్నీ రైళ్లలోనే చేస్తారు. తక్కువ ఛార్జీ, తక్కువ సమయం, కంఫర్జ్ జర్నీ ఉంటుంది కాబట్టి అందరూ దీనికే ప్రిఫర్ చేస్తారు.

Indian Railways: రైళ్లకు గ్రీన్, బ్లూ, రెడ్ కలర్స్ కోచ్‌లే ఏందుకు ఉంటాయి? అసలు రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Train

Updated on: Feb 09, 2023 | 7:30 AM

దేశ వ్యాప్తంగా చాలా మంది రైలు ప్రయాణాలకు ఇష్టపడుతారు. సుదూర ప్రయాణాలన్నీ రైళ్లలోనే చేస్తారు. తక్కువ ఛార్జీ, తక్కువ సమయం, కంఫర్జ్ జర్నీ ఉంటుంది కాబట్టి అందరూ దీనికే ప్రిఫర్ చేస్తారు. అయితే, ట్రైన్ ఎక్కిన వారు.. ఆ కోచ్‌లకు ఉండే రంగులను కూడా గమనించే ఉంటారు కదా? వాటిలో చాలా కోచ్‌లకు నీలం, ఎరుపు, ఆకుపచ్చ రంగు వేసి ఉంటుంది. ఈ కోచ్‌ల విభిన్న రంగుల వెనుక ప్రత్యేక కారణం ఉంది. మరి మీరెప్పుడైనా దీని గురించి ఆలోచించారా? మీ ఆలోచనకు ఆన్సర్ దొరకలేదా? అయితే, ఇవాళ ఆన్సర్ తెలుసుకుందాం..

ఆకుపచ్చ, గోధుమ రంగు కోచ్‌లు..

గరీబ్‌రథ్ రైళ్లలో ఆకుపచ్చ రంగు కోచ్‌ల ఉంటాయి. సాధారణ ప్రయాణీకులకు కొంత భిన్నమైన అనుభూతిని అందించడానికి భారతీయ రైల్వే ఈ రంగును వేసింది. ఈ ఆకుపచ్చ రంగుపై అనేక రకాల పెయింటింగ్‌లు కూడా వేయబడ్డాయి. ఇది కోచ్‌ను చూడటానికి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. మరోవైపు, చిన్న లైన్లలో నడిచే మీటర్ గేజ్ రైళ్లలో బ్రౌన్ కలర్ కోచ్‌లను ఉపయోగిస్తారు.

ఎరుపు రంగు..

శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఎరుపు రంగు కోచ్‌లు ఎక్కువగా కనిపిస్తాయి. అల్యూమినియంతో తయారు చేయబడిన ఈ కోచ్‌లు ఇతర కోచ్‌ల కంటే చాలా తేలికగా ఉంటాయి. దీని కారణంగా వాటి వేగం కూడా పెరుగుతుంది. 2,000 సంవత్సరంలో జర్మనీ నుంచి తెప్పించిన ఈ కోచ్ లు గంటకు 160 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వీటికి డిస్క్ బ్రేక్‌లు కూడా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

నీలి రంగు..

భారతీయ రైల్వేలోని చాలా రైళ్ల కోచ్‌లు నీలం రంగులో ఉంటాయి. ఈ కోచ్‌లను ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో అమర్చారు. ఇటువంటి కోచ్‌లు ఇనుముతో తయారు చేయడం జరిగింది. వాటిని ఆపడానికి ఎయిర్‌బ్రేక్‌లను ఉపయోగిస్తారు. వీటిని తయారు చేసే ఫ్యాక్టరీ చెన్నైలో ఉంది. అధిక బరువు కారణంగా, ఈ కోచ్‌లను గంటకు 70 నుండి 140 కి.మీ వేగంతో మాత్రమే నడపవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..