India Coast Guard rescues operation in Maharashtra: భారత కోస్ట్ గార్డ్ బృందం మరో సాహసంతో తమ సత్తా చాటుకుంది. గురువారం ఆరేబియా మహా సముద్రంలో మునిగిపోతున్న ఓ రవాణా ఓడ నుంచి16 సిబ్బందిని రక్షించింది. రాయగడ్ జిల్లా రేవ్‌దండా పోర్ట్ సమీపంలో ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.
మహారాష్ట్రలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారడంతో ముంబై తీర ప్రాంతంలో ఓ రవాణా నౌక ముునిగిపోయింది. రేవ్‌దండా జెట్టీకి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఘటనను గుర్తించి ఐసీజీ వెంటనే అప్రమత్తమైంది. ఇద్దరు ఐసిజి ఛాపర్లు ‘ఎయిర్-సీ’ సమన్వయ ఆపరేషన్ నిర్వహించి ఆ నౌకలోని సిబ్బందిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.
మునిగిపోతున్న మంగళం అనే నౌక నుంచి సాయం కోరుతూ వచ్చిన సందేశంతో డామన్ నుంచి రెండు చేతక్ హెలికాపర్టు రంగంలోకి దిగాయి. అలాగే, మునుగుతున్న ఓడలో చిక్కుకుపోయిన సిబ్బందిని రక్షించేందుకు ముంబైలోని మురుద్ జంజీరా కోట నుంచి సుభద్ర కుమారి చౌహాన్ నౌక బయలుదేరింది. డిఘి నుండి బయలుదేరగా, డామన్‌లోని ఎయిర్ స్టేషన్ నుండి మరో రెండు ఐసిజి హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి. అనంతరం అన్నీ కలిసి సమన్వయం చేసుకుంటూ నౌకలో చిక్కుకున్న మొత్తం 16 మంది సిబ్బందిని రక్షించి రేవండాకు తరలించారు.
In a daredevil sea-air coordinated Operation in inclement weather and rough sea conditions,#ICG 02 Chetak Helicopters ex-Daman & Ship Subhadra Kumari Chauhan rescued 16 crew from Barge MV Mangalam reported aground off #Revdanda #Mumbai today. All crew safe. @DefenceMinIndia pic.twitter.com/fdzMhtcf3x
— Indian Coast Guard (@IndiaCoastGuard) June 17, 2021
Read Also….
HDFC Bank Car Loan: ఆ పరికరాన్ని కొనుగోలు చేసిన వారందరికీ రీఫండ్; అకౌంట్‌లో జమచేస్తామన్న బ్యాంక్!