Doctors Save Woman Life : దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. ప్రతిరోజూ లక్షలాది కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో వేలాది మంది మరణిస్తున్నారు. వీటన్నిటి మధ్య ఒక వార్త వెలువడింది. ఇది ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే ఒక మహిళ ఆక్సిజన్ స్థాయి 40 కి చేరుకుంది. అయినా ఆమె బతికింది. జార్ఖండ్‌లోని రాంచీ మార్కెట్‌కు చెందిన 57 ఏళ్ల మహిళ కరోనాకు గురైంది. ఆ మహిళ పాజిటివ్‌గా మారినప్పుడు మామూలుగానే ఉంది. కానీ రోజులు గడిచిన కొద్ది ఆమె ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది. వెంటనే మహిళను రాంచీలోని సదర్ ఆసుపత్రిలో చేర్చారు. ఇక మహిళ పరిస్థితి మీరు ఊహించవచ్చు. ఆమె ఆక్సిజన్ స్థాయి 40 కి పడిపోయింది. ఇక మరణం నుంచి తప్పించుకోవడం అసంభవం అని తేలింది. కానీ వైద్యులు ఆ మహిళ గురించి పెద్ద రిస్క్ చేసి ఆమె జీవితాన్ని కాపాడారు.
ఆమెను వెంటిలెటర్‌పై మార్చినా కూడా ఎటువంటి మెరుగుదల కనిపించలేదు. తరువాత వైద్యులు మహిళను కాపాడటానికి నోటి ద్వారా ఒక ట్యూబ్ పెట్టి, ఇన్వాసివ్ వెంటిలేటర్ మీద ఉంచారు. ఈ పద్ధతి చాలా కష్టం. ఈ పద్ధతి ఆసుపత్రిలో ఎవరిపైనా ప్రయోగించలేదు. కానీ ఇదే మహిళ ప్రాణాలను కాపాడింది. వైద్యుల ఈ ప్రయత్నం వల్ల మహిళ ఆక్సిజన్ స్థాయి నేరుగా 40 నుంచి 93 కి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి మహిళ చికిత్స పొందుతోంది ప్రమాదం నుంచి బయటపడింది.