ఎలుకల్ని తరిమి కొట్టేందుకు ఈజీ టిప్స్‌.. ఇలా చేశారంటే రమ్మనా రావు..!

ఎలుకలు చూడటానికి చాలా చిన్నగానే ఉంటాయి. కానీ అవి ఇంట్లో కలిగే సమస్యలు మాత్రం మనం భరించలేనంత పెద్ద సమస్యలను కలిగిస్తాయి. అవి తినదగిన వస్తువులను పాడు చేయడమే కాకుండా విద్యుత్ తీగలను కూడా కొరికేస్తుంటాయి. మీ ఇంట్లో కూడా ఎలుకల బెడద ఎక్కువగా ఉన్నట్టయితే.. ఇలాంటి నివారణ చర్యలతో వాటిని ఈజీగా తరిమికొట్టవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...

ఎలుకల్ని తరిమి కొట్టేందుకు ఈజీ టిప్స్‌.. ఇలా చేశారంటే రమ్మనా రావు..!
Rats At Home

Updated on: Apr 22, 2025 | 3:36 PM

ఎలుకల భయం లేకుండా ఉండాలంటే.. అతి ముఖ్యమైనది ఎప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా వంటగదిలోని ఆహార పదార్థాలను సరిగ్గా మూసి ఉంచుకోవాలి. అంతేకాదు..ఎలుకలకు పుదీనా, లవంగం వాసన అస్సలు నచ్చదు. కాబట్టి ఇంట్లో ప్రతి మూలలో పుదీనా, లవంగం ఆకులను ఉంచండి. ఎలుకలు ఇంట్లోకి రాకుండా ఉండేందుకు పిప్పరమెంట్ల నీళ్లను పిచికారీ చేయవచ్చు.

ఎలుకలను తరిమికొట్టడంలో బే ఆకులు కూడా చాలా ప్రభావవంతంగా పరిగణిస్తాయి. వాటిని మీ వంటింట్లో అక్కడక్కడ కబోర్డుల్లో, అల్మారాల్లో, ఇంటి ప్రతి మూలలో బిర్యానీ ఆకులు ఉంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

ఎలుకలు ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి యొక్క ఘాటైన వాసనను ఇష్టపడవు. మీరు ఇంట్లోని అన్ని ప్రాంతాలలో ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలను ఉంచటం వల్ల కూడా ఎలుకలు చేరకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఎలుకలు ఎక్కువగా సంచరించే ప్రదేశంలో పటిక నీటిని పిచికారీ చేయొచ్చు. అలాగే, ఎర్ర కారం పొడిని చల్లడం ద్వారా కూడా ఎలుకలు రాకుండా చేయొచ్చు. మెత్తగా నూరిన కర్పూరాన్ని ఎలుకలు ఉన్న ప్రదేశంలో చొప్పించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..