Dreams: కలలో ఏనుగులు కనిపిస్తే ఏమవుతుంది.? దాని అర్థం ఏంటంటే..

సాధారణంగా ఏనుగు కలలో కనిపిస్తే భయానికి గుర్తుగా భావిస్తుంటాం. కానీ అలాంటిది ఏం లేదని పండితులు చెబుతున్నారు. కలలో ఏనుగు కనిపించడం శుభసూచికంగా చెబుతున్నారు. ఏనుగు కుంభస్థలం లక్ష్మీదేవీ నివాస స్థానంగా చెబుతుంటారు. ఏనుగు కలలో దర్శనం ఇవ్వడం చాలా శుభప్రదమని చెబుఉతన్నారు. ఏనుగులు కలలో కనిపించడం పాపాలు, దారిద్య్రం...

Dreams: కలలో ఏనుగులు కనిపిస్తే ఏమవుతుంది.? దాని అర్థం ఏంటంటే..
Dreams

Updated on: Mar 21, 2024 | 9:23 PM

మనకు నిద్రలో ప్రతీరోజూ ఏదో ఒక కల వస్తుంది. కలలు రావడం సర్వసాధారణమైన విషయం. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం కలలో కనిపించేవి మనకు కొన్ని విషయాలను తెలియజేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల కలల మనకు చెడును తెచ్చి పెడితే మరికొన్ని మాత్రం మంచి చేస్తాయని చెబుతున్నారు. మరి కలలో ఏనుగు కనిపిస్తే ఏమవుతందో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా ఏనుగు కలలో కనిపిస్తే భయానికి గుర్తుగా భావిస్తుంటాం. కానీ అలాంటిది ఏం లేదని పండితులు చెబుతున్నారు. కలలో ఏనుగు కనిపించడం శుభసూచికంగా చెబుతున్నారు. ఏనుగు కుంభస్థలం లక్ష్మీదేవీ నివాస స్థానంగా చెబుతుంటారు. ఏనుగు కలలో దర్శనం ఇవ్వడం చాలా శుభప్రదమని చెబుఉతన్నారు. ఏనుగులు కలలో కనిపించడం పాపాలు, దారిద్య్రం, దుఃఖాం వంటివి దూరమవుతాయని చెబుతున్నారు. ఏనుగు కనిపిస్తే అదృష్టం, ఐశ్వర్యం చేకూరుతుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. కలలో ఏనుగు కనిపిస్తే మీ దశ తిరుగుందని అర్థం చేసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు.

అప్పటి వరకు ఆర్థికంగా ఎదుర్కొన్న కష్టాలకు స్వస్తి పడుతుందని అర్థం చేసుకోవాలి. త్వరలోనే మీ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి.. మంచి రోజులు రానున్నాయని చెబుతున్నారు. ఏదో రకంగా ధన లాభం కలుగుతుందని చెబుతున్నారు. అలాగే ఏనుగు కనిపిస్తే మీకు గౌరవం దక్కుతుందని అర్థం. ఇక ఏనుగుల జంట కనిపిస్తే.. మీ వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుందని అర్థం. ప్రేమ వ్యవహారాల్లో మీరు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ఇక కలలో ఏనుగు ఊగుతున్నట్లు కనిపిస్తే.. అన్ని రకాల సమస్యల నుంచి బయటపడబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే ఒకవేళ ఏనుగు నవ్వుతున్నట్లు కనిపిస్తే శుభవార్త వినబోతున్నారని అర్థం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, స్వప్న శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఇందులో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..