SI helps funeral corona man: కరోనా పాజిటివ్ వచ్చిందంటే చాలు రక్త సంబంధీకులు సైతం అమడదూరం పోతున్నారు. పొరపాటున ప్రాణాలు పోతే కడసారి చూపుకు సైతం నోచుకోవడంలేదు. అలాంటిది, కరోనా మృతదేహనికి దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు కరీంనగర్ జిల్లా పోలీసులు.
ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనా సోకిందని చెరువులో పడి మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహన్ని బయటకు తీసి, అంత్యక్రియలు నిర్వహించారు. ఈ దృశ్యాలను ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో చూసిన వారు పోలీస్ సేవలకు.. సెల్యూట్ అంటూ అభినందిస్తున్నారు.
సిరిసేడు గ్రామానికి చెందిన యాంసాని అమృతమ్మ, సంపత్, సతీష్‌లకు నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలో సంపత్(38) మంగళవారం బహిర్భూమికి స్థానిక చెరువు వద్దకు వెళ్లాడు. శ్వాస సరిగా అందకపోవడంతో చెరువులో పడి మృతి చెందాడు. దీంతో మృతుని కుటుంబ సభ్యులు తల్లి, తమ్ముడు, సోదరి సైతం కరోనా బారిన పడడంతో ఎవ్వరు మృతదేహం ముట్టుకోడానికి కూడా సాహసించలేదు.
విషయం తెలిసినా గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యులు ఎవరూ దగ్గరికి వెళ్లలేదు. ఇందుకు సంబంధించి సమాచారం రావడంతో ఎస్ఐ ప్రవీణ్ రాజ్, ట్రైనీ ఎస్ఐ రజనీకాంత్‌తో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసేందుకు సహాయం చేయాలని కోరినా గ్రామస్తుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారిద్దరే బయటకు తీశారు. అనంతరం గ్రామ శివారులో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రతిఒక్కరూ పోలీసులకు సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు. ఇద్దరు ఎస్సైలు చూపిన ఔదార్యాన్ని చూసి గ్రామస్థులతో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి, కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి వారిని అభినందించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించే పతకాలకు ఎస్ఐ ప్రవీణ్ రాజ్ పేరును ప్రతిపాదిస్తామని సిపి ప్రకటించారు.
With the fear of contracting #CoronaVirus infection, kin turned away from bidding final farewell to their loved one.
Police of #IllandaKuntaPS with no hesitation has carried the mortal-remains to cremate, as their #SocialResponsibililty. https://t.co/kmxSYHva7a— DGP TELANGANA POLICE (@TelanganaDGP) May 11, 2021
Read Also… Lockdown: తెలంగాణలో మొదలైన లాక్‌డౌన్… నిర్మల్ జిల్లాలో ఎలా ఉందో తెలుసుకున్న మంత్రి