
గులాబీ సాగు అనేది కేవలం ఒక పువ్వును ఉత్పత్తి చేయడం మాత్రమే కాదు.. ఇది లాభదాయకమైన వ్యాపారంగా కూడా పరిగణించబడుతుంది. సరైన పద్ధతులు అనుసరించడం ద్వారా.. గులాబీ సాగు వల్ల రైతులు మంచి ఆదాయం పొందవచ్చు. గులాబీ సాగు పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రెండు పద్ధతులలో ఏదైనా ఉపయోగించి గులాబీ సాగు చేయవచ్చు.
గులాబీ సాగు దాదాపు అన్ని రకాల నేలల్లో చేయవచ్చు. కానీ నీరు నిలిచిపోయే అవకాశం లేని నేలలు ఉత్తమం. జనవరి, ఫిబ్రవరి నెలలు గులాబీ మొక్కలు నాటడానికి అనుకూలమైనవి.
ఒక హెక్టారు పొలంలో గులాబీ సాగు చేయడానికి సుమారు 1 లక్ష రూపాయల పెట్టుబడి అవసరం అవుతుంది. అయితే ఏడాదిలో ఈ పంట నుండి 6 నుండి 7 లక్షల రూపాయల నికర లాభం పొందవచ్చు.
గులాబీ మొక్కలకు రోజుకు ఆరు గంటల సూర్యరశ్మి కావాలి. అదేవిధంగా నీరు నిలిచిపోయే అవకాశం లేని నేల అవసరం. పొలం సిద్ధం చేయడానికి ముందు రైతులు సేంద్రియ ఎరువులు వేయాలి. ఇది మొక్కలకు పోషణను అందిస్తుంది. వేసవిలో గులాబీ మొక్కలకు ప్రతి రెండు రోజులకు నీరు పెట్టాలి. అయితే శీతాకాలంలో 5-10 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. నీరు ఎక్కువగా ఉంటే మొక్కలు కుళ్ళిపోతాయి. నీరు తక్కువగా ఉంటే పువ్వులు వాడిపోతాయి. కాబట్టి మొక్కలకు నీరు పెట్టే విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
గులాబీలలో వివిధ రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని సోనియా, స్వీట్ హార్ట్, సూపర్ స్టార్, సాంద్రా, హ్యాపీనెస్, గోల్డ్‌మెడల్, మణిపాల్, బెంజామిన్ పాల్, అమెరికన్ హోమ్, గ్లాడియేటర్, కిస్ ఆఫ్ ఫైర్, క్రిమ్సన్ గ్లోరీ. భారతదేశంలో పూసా సోనియా, ప్రియదర్శని, ప్రేమ, మోహని, బంజారన్, ఢిల్లీ ప్రిన్సెస్ రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి.
కొత్త గులాబీ మొక్కలను నాటడానికి ముందు ప్రతి గుంటలో సగ భాగం మట్టి, సగ భాగం బాగా కుళ్ళిన పశువుల ఎరువును కలపాలి. మొక్క పెరిగేకొద్దీ.. నత్రజని, భాస్వరం, పొటాష్ మూడింటినీ సరిసమాన మోతాదులో మొక్కకు అందించాలి. పువ్వుల మెరుపును పెంచడానికి మెగ్నీషియం సల్ఫేట్, ఫెర్రస్ సల్ఫేట్, బోరాక్స్ మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. ఈ పంటకు ప్రత్యేకంగా శ్రద్ధ వహించవలసిన విషయం ఏమిటంటే.. కత్తిరింపు. దీనికి ప్రతి వారం కత్తిరింపు అవసరం. గులాబీ సాగు లాభదాయకమైన వ్యవసాయం. సరైన పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చు.