Fake Fertilizer: రైతులకు సూచన..! నకిలీ ఎరువులని గుర్తుపట్టడం ఎలా..? తెలుసుకోండి..

Fake Fertilizer: దేశంలోని పలు ప్రాంతాల్లో రసాయన ఎరువుల కొరత ఉంది. గంటల తరబడి క్యూలో నిలబడి ఎరువుల బస్తాలు తెచ్చుకునే రైతుల వరుసలు ప్రతిరోజూ

Fake Fertilizer: రైతులకు సూచన..! నకిలీ ఎరువులని గుర్తుపట్టడం ఎలా..? తెలుసుకోండి..
Fertilizer

Edited By:

Updated on: Nov 15, 2021 | 1:09 PM

Fake Fertilizer: దేశంలోని పలు ప్రాంతాల్లో రసాయన ఎరువుల కొరత ఉంది. గంటల తరబడి క్యూలో నిలబడి ఎరువుల బస్తాలు తెచ్చుకునే రైతుల వరుసలు ప్రతిరోజూ మీడియాలో కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు గంటల తరబడి క్యూలో నిలబడినా ఎరువుల బస్తాలు దొరకడం లేదు. దీంతో వారి వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇదిలా ఉండగా నకిలీ ఎరువులను అంటగట్టి కొంతమంది అక్రమార్కులు రైతులను నిలువునా మోసగిస్తున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం తెరపైకి వచ్చాయి.

రైతు సోదరులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి నకిలీ-అసలు ఎరువులను గుర్తుపట్టాలి. దీనివల్ల కష్టపడి సంపాదించిన డబ్బు ఆదా అవుతుంది. ఆదివారం యూపీలోని ముజఫర్‌నగర్‌లో నకిలీ ఎరువుల ఫ్యాక్టరీని పోలీసులు గుట్టురట్టు చేశారు. నకిలీ ఎరువుల కర్మాగారం యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని స్థావరం నుంచి 170 బస్తాలను కనుగొన్నారు. ఈ ఎరువుల సంచిలపై దేశంలోని ప్రసిద్ధ కంపెనీల పేర్లు, లోగోలు ఉన్నాయి. చాలా కాలంగా నకిలీ ఎరువు తయారీ జరుగుతున్నట్లు ఈ విషయం ద్వారా వెల్లడవుతోంది.

ఈ ప్రాథమిక విషయాలను గుర్తుంచుకోండి
మీరు మార్కెట్లో ఎరువులు కొనడానికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రాథమిక తేడాలను గుర్తుంచుకోండి. మార్కెట్‌లో ఎరువుల ధరలు ఆకాశాన్నంటడంతో కొంతమంది వ్యాపారులు తక్కువ ధరకి రైతులకు ఆశ చూపుతున్నారు. అయితే అసలుకు, నకిలీకి అర్థంకాక రైతులు పూర్తిగా డబ్బులు చెల్లించి నాసిరకం సరుకులు తెచ్చుకొని మోసపోతున్నారు. దీని వల్ల పంట నాశనమవుతుంది. అందుకే నిజమైన ట్రేడర్స్‌ దగ్గరే ఎరువులను కొనండి. బ్లాక్‌లో తక్కువకు వస్తున్నాయంటే అస్సలు నమ్మకండి.

అసలు, నకిలీని ఎలా గుర్తించాలి..?
అసలు, నకిలీ ఎరువులను గుర్తించడం పెద్ద కష్టమేమి కాదు. ఎరువుని చేతిలోకి తీసుకోగానే చాలా విషయాలు అర్థమవుతాయి. DAp విషయంలో చెప్పాలంటే ఇది గట్టిగా, గోధుమ రంగులో, నలుపు రంగులో ఉంటుంది. గోళ్ళతో నొక్కినా సులభంగా విరిగిపోదు. అంతేకాకుండా సున్నంతో రుద్దితే తట్టుకోలేని ఘాటైన వాసన వస్తుంది. వేడి ప్లేట్‌లో నెమ్మదిగా వేడి చేస్తే డీఏపీ గింజలు ఉబ్బుతాయి. అదేవిధంగా యూరియాను కూడా తనిఖీ చేయవచ్చు. అసలు యూరియా గింజలు తెలుపు, మెరిసే, ఏకరీతి ఆకారం, గుండ్రని ఆకారంలో ఉంటాయి. చేతికి తడి అంటితే చల్లగా ఉంటుంది. నీటిలో పూర్తిగా కరుగుతుంది. వేడి ప్లేట్‌లో ఉంచితే వెంటనే కరిగిపోతుంది.

NZ vs AUS, T20 World Cup 2021 Final: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఘన విజయం..

Eyebrows: వయసు పెరిగే కొద్ది కనుబొమ్మలపై ఈ తేడాలు గమనించారా..! అసలు నిజం తెలుసుకోండి..

Backache: వెన్నునొప్పితో బాధపడుతున్నారా..! ఒక్కసారి ఈ ఆయుర్వేద చిట్కాలు ట్రై చేయండి..

Follow Us