India: మీకు తెలుసా? కేవలం 16 శాతం మంది భారతీయుల వద్దే ఈ 3 వస్తువులు ఉన్నాయంట..

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చేపట్టిన ఓ అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో ఇప్పటికీ..

India: మీకు తెలుసా? కేవలం 16 శాతం మంది భారతీయుల వద్దే ఈ 3 వస్తువులు ఉన్నాయంట..
Indians Only Having These 3
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 20, 2022 | 1:00 PM

మీకు ఇది తెలుసా.? దేశంలో టీవీ, ఫ్రిజ్‌, వాషింగ్‌ మిషన్‌ ఉన్న కుటుంబాలు కేవలం 16 శాతం మాత్రమే ఉన్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చేపట్టిన ఓ అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో ఇప్పటికీ 50 శాతం కుటుంబాలకు ద్విచక్ర వాహనం లేదు. అలాగే కేవలం 7 శాతం కుటుంబాలకు మాత్రమే కారు ఉందని పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే.. భారతీయుల్లో ఎంతమంది ధనవంతులు ఉన్నారో మీకే అర్ధమైపోతుంది.

మరోవైపు 49 శాతం భారతీయ కుటుంబాలకు ద్విచక్ర వాహనాలు ఉండగా.. 50.4 శాతం కుటుంబాలు కేవలం సైకిల్‌పైనే ఆధారపడుతున్నాయి. ఇక టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్‌ల విషయానికొస్తే.. 68 శాతం ఇళ్లలో టీవీ.. 38 శాతం మందికి ఫ్రిజ్.. 18 శాతం కుటుంబాల్లో వాషింగ్ మిషన్ ఒక్కటే ఉన్నట్లు తేలింది. అలాగే దేశంలో సైకిల్, ద్విచక్ర వాహనం, కారు కూడా లేని కుటుంబాల సంఖ్య 24.7 శాతంగా ఉంది. కాగా, దేశంలోని 24 శాతం కుటుంబాలకు ఎయిర్ కండిషనర్లు లేదా ఎయిర్ కూలర్లు ఉన్నాయి. (Source)