Human Body: మానవ శరీర నిర్మాణంలో కొన్ని ముఖ్యాంశాలు.. ఆసక్తికర విషయాలు..!

| Edited By: Ravi Kiran

Jan 25, 2022 | 7:59 AM

Human Body: మానవ శరీరం అనేక కోట్ల కణాలతో నిర్మితమైనదని మనకు తెలుసు. మనిషి జీవన క్రియ సక్రమంగా జరగాలంటే శరీర..

Human Body: మానవ శరీర నిర్మాణంలో కొన్ని ముఖ్యాంశాలు.. ఆసక్తికర విషయాలు..!
Follow us on

Human Body: మానవ శరీరం అనేక కోట్ల కణాలతో నిర్మితమైనదని మనకు తెలుసు. మనిషి జీవన క్రియ సక్రమంగా జరగాలంటే శరీర నిర్మాణం క్రమముగా ఉండాలి. చిన్నప్పుడు స్కూల్ లో మన శరీరం గురించి ఎన్నో విషయాలు నేర్చుకొని ఉంటాం. కాని కొన్నేళ్ళు గడిచిన తర్వాత అవన్నీ మనకి గుర్తుంటాయన్న గ్యారంటీ లేదు. ఏది ఏమైనా… మన శరీరం గురించి ఇప్పటికి కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి తెలుసుకుందాం..!!

► ఓ సాధారణ వ్యక్తిలో 206 ఎముకలు ఉంటాయి.

► మన చేతిలో 27 ఎముకలు ఉంటాయి.

► మన శరీరంలో 639 కండరాలు ఉంటాయి.

► పాల పళ్ళు 20 ఉంటాయి.

► ప్రక్కటెముకలు/రిబ్స్ 24 (12 జతలు) ఉంటాయి.

► అయోర్టా/ బృహద్ధమని అనేది మన శరీరంలో అతి పెద్ద ధమని/ఆర్టరీ.

► మన పాదాలు రెండిటిలో కలిపి మొత్తం 52 ఎముకలు ఉంటాయి.

► లివర్ అనేది మన శరీరంలో అతి పెద్ద గ్రంధి.

► చెర్మం అనేది మన శరీరంలో అతి పెద్ద అవయవం.

► ఒక పూర్తి చేయిలో 72 కండరాలు ఉంటాయి.

► మన శరీరంలో ఉండే కణాలలో అన్నిటికన్నా పెద్దది అండము.

► మన శరీరంలో ఉండే కణాలలో అన్నిటికన్నా చిన్నది వీర్యం.

► మన చెవి భాగంలో ఉండే స్టేప్స్ అనే ఎముక మన శరీరంలోనే అన్నిటికన్నా చిన్నది.

► ఇక అన్ని ఎముకలకన్నా పెద్దది, దృఢమైనది తోడ ఎముక.

► రెడ్ బ్లడ్ సెల్స్/ఎర్ర రక్త కణాలు 120 రోజులు మాత్రమే జీవిస్తాయి.

► శరీరములో అతి పెద్ద అవయవము = కాలేయము.

► శరీరములో అతి చిన్న అవయవము = సార్డోరియస్(చెవి లో).

► అప్పుడే పుట్టిన శిశువు బరువు = 2.5 – 3.0 కిలోలు.

► సగటున రోజుకు కావలసిన ఆహారము = 2400

► మానవులు నిముసానికి ఎన్నిసార్లు శ్వాసిస్తారు? = 18 -24 సార్లు.

► సగటున రోజుకి కావలసిన నీరు = 5 లీటర్లు.

► నిముసానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? = 72 సార్లు.

► మనుషులలో సగటు రక్తము = 5 లీటర్లు.

► మానవుని కపాలములో ఎముకల సంఖ్య = 22.

► చేతులు+కాలులోగల ఎముకల సంఖ్య = 30.

► వెన్నుపూసల సంఖ్య = 33.

► మానవునిలో అతి పొడవైన కణము = నాడీకణము.

► శరీరములో కణాల సంఖ్య = 75 ట్రిలియన్లు (సుమారుగా)

► మెదడు బరువు = 1350 గ్రాములు

► గుండె బరువు = 300 గ్రాములు.

► మూత్రపిండాల బరువు = 250 గ్రాములు.

► కాలేయము బరువు = 1500 గ్రాములు.

► పురుషులలో ఎర్రరక్త కణాలు = 4,5-5.0 మిలియన్స్/ఘ.మి.మీ.

► మహిళలలో ఎర్రరక్త కణాలు = 4.0-4.5 మిలియన్లు / ఘన.మి.మీ.

► ఎర్ర రక్త కణాల జీవిత కాలము = 120 రోజులు.

► తెల్లరక్త కణాల సంఖ్య = 4000 – 11000/ఘన.మి.మీ.

► అతి పెద్ద తెల్ల రక్తకణము = మోనో సైట్.

► తెల్ల రక్త కణాల జీవిత కాలము = 12-13 రోజులు.

నోట్‌: ఈ వివరాలన్ని వైద్య నిపుణుల ఆధారంగా అందించబడ్డాయి.)

ఇవి కూడా చదవండి:

Basil Health Benefits: తులసితో అద్భుతమైన ఉపయోగాలు.. పలు అధ్యయనాలలో కీలక విషయాలు!

Turmeric Milk: పసుపు పాలు తాగితే ఏమవుతుంది…? ఎలాంటి ప్రయోజనాలు..!