Viral Video: చేతుల్లేవ్‌.. కాళ్లకు తాడు కట్టుకుని ఈత... ఇది నిజంగా శివయ్య లీలేనా..? వైరల్ అవుతున్న వీడియో

Viral Video: చేతుల్లేవ్‌.. కాళ్లకు తాడు కట్టుకుని ఈత… ఇది నిజంగా శివయ్య లీలేనా..? వైరల్ అవుతున్న వీడియో

Anil kumar poka

|

Updated on: Jan 25, 2022 | 7:34 AM

Man Swimming Without Hands: ఈత కొట్టాలంటే చేతులు కాళ్లు ఆడించాల్సి ఉంటుంది. ఎంతో క‌ష్ట‌పడి కాళ్లు చేతులూ క‌దిపితేనే ఈత కొట్టడం సాధ్యమ‌వుతుంది. కానీ, ఇక్కడో వ్యక్తి మాత్రం ఒక చేయి పూర్తిగా లేకపోయినా. మ‌రో చేతికి రెండే వేళ్లు ఉన్నా ఇక రెండు కాళ్లు ఉన్నా కాళ్లకు తాడు...

Swimming Without Hands: ఈత కొట్టాలంటే చేతులు కాళ్లు ఆడించాల్సి ఉంటుంది. ఎంతో క‌ష్ట‌పడి కాళ్లు చేతులూ క‌దిపితేనే ఈత కొట్టడం సాధ్యమ‌వుతుంది. కానీ, ఇక్కడో వ్యక్తి మాత్రం ఒక చేయి పూర్తిగా లేకపోయినా. మ‌రో చేతికి రెండే వేళ్లు ఉన్నా ఇక రెండు కాళ్లు ఉన్నా కాళ్లకు తాడు క‌ట్టుకుని మ‌రీ నీటిలో దిగి ఈత కొడుతున్నాడు. ఏపీకి చెందిన శివయ్య అనే వ్యక్తి ఈతతో చేస్తున్న విన్యాసాలు చూస్తే ఎవరైనా షాక్‌ అవ్వాల్సిందే.విశాఖ భీమిలి మండ‌లం బ‌స‌వ‌పాలెం గ్రామానికి చెందిన శివయ్య.. పుట్టుకతోనే పోలియో బాధితుడు. ఎడమచేయి పూర్తిగా లేదు, కుడిచేతికి రెండు వేళ్లు మాత్రమే. కానీ, ఉన్న రెండు కాళ్లకు తాడును క‌ట్టుకుని ఈత కొడుతూ అంద‌ర్నీ ఆశ్చర్యప‌రుస్తున్నాడు. 15 ఏళ్ల క్రితం శివ‌య్య ఓ న‌దిలో స్నానానికి దిగిన స‌మ‌యంలో ఈత రాక‌పోయినా పైకి తేల‌డం గ్రహించాడు. అప్పటి నుండి నీళ్లపై తేలుతూ అంద‌ర్నీ ఆశ్చర్యప‌రుస్తున్నాడు. దాంతో ఊరంతా శివ‌య్యకు ఏవో శ‌క్తులు ఉన్నాయ‌ని అనుకుంటున్నారు.ఆరేళ్ల క్రితం దాతల సాయంతో భీమిలి మండలం అన్నవరం–అమనాం పంచాయతీల మధ్య బసవపాలెంలో బసవేశ్వరుని పేరుతో శివాలయం నిర్మించాడు. ఇకపోతే తనకంటూ అయినవాళ్లు ఎవరూ లేని శివయ్య..ఆ శివుడి సేవలోనే గడుపుతున్నాడు.. ఏ మాత్రం చదువుకోని శివయ్య తాను నిర్మించిన ఆలయంలో స్వయంగా శివలింగానికి అష్టోత్తరాలు, పూజలు జరిపిస్తుంటాడు.