Gold Fish Driving Video: కారు డ్రైవ్ చేస్తున్న చేప… శాస్త్రవేత్తల ప్రయోగం ఫలించేనా..? వైరల్ అవుతున్న వీడియో..
Goldfish: అక్వేరియంలో అటూ ఇటూ తిరుగుతూ చూపరులను ఎంతగానో ఆకర్షించే గోల్డ్ ఫిష్ ఏకంగా డ్రైవింగ్ చేసేస్తోంది. శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో భాగంగా ఈ చేప తెలివిగా ఈదుతూ నీటితో నింపిన వాటర్ ట్యాంక్‌ని ముందుకు తీసుకెళ్లింది.
Goldfish: అక్వేరియంలో అటూ ఇటూ తిరుగుతూ చూపరులను ఎంతగానో ఆకర్షించే గోల్డ్ ఫిష్ ఏకంగా డ్రైవింగ్ చేసేస్తోంది. శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో భాగంగా ఈ చేప తెలివిగా ఈదుతూ నీటితో నింపిన వాటర్ ట్యాంక్‌ని ముందుకు తీసుకెళ్లింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ చిన్న వాటర్ ట్యాంక్‌లో నీటిని నింపారు. అందులో గోల్డ్ ఫిష్‌ని ఉంచారు. ఆ ట్యాక్ కింద ఓ 4 చక్రాలు అమర్చారు. ట్యాంక్ నుంచి ఓ గొట్టాన్ని నిలబెట్టి… దానికి పైన ఓ లైడర్, కంప్యూటర్, కెమెరా అమర్చారు. ఇప్పుడు ఆ చేప… ఈదుతూ ముందుకు వెళ్లాలి. అలా వెళ్లేటప్పుడు అది అడ్డంకులను తప్పించుకొని వెళ్లాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా అంతా సెట్ చేశారు. శాస్త్రవేత్తలు ఊహించినట్లే ఆ చేప తెలివిగా ముందుకు వెళ్లింది. అది ముందుకు ఎటు వెళ్తే అటు ఆ ట్యాంక్ కదిలింది. సముద్రాలు, చెరువుల్లో చేపలు తమ ముందు వచ్చే అడ్డంకులను తప్పించుకుంటాయి… తమ ఆహారాన్ని అవి ఎలా వెతుక్కుంటాయి.. వాటి గూడును అవి ఎలా కనిపెడతాయో గ్రహించేందుకు ఈ ప్రయోగం చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
ముఖ్యంగా పగడపు దీవుల్లో చేపలు ఎలా నివసిస్తాయో, వాటి బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుంది.. చేపల్ని అవి ఉన్న ప్రదేశం నుంచి వేరు చేస్తే… అప్పుడు అవి నావిగేషన్ చేసుకోగలవో లేదా అనే అంశాలు తెలుసుకునేందుకు ఈ పరిశోధనలు చేసినట్లు ఇజ్రాయెల్ లోని బెన్ గురియన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. మోటర్ తో పనిచేసే కారును గోల్డ్ ఫిష్ నడిపిందని, ఆ చేపకు తాము ఎలాంటి ట్రైనింగూ ఇవ్వలేదనీ… దానంతట అదే ముందుకు సాగిందని తెలిపారు. జనవరి 3న పోస్ట్ చేసిన వీడియోని వీక్షించిన లక్షలమంది నెటిజన్లు చేప డ్రైవింగ్‌ను ఎంతగానో లైక్ చేస్తున్నారు.
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్‌కు ఫిదా నెటిజన్లు

