House Cleaning Tips: ఫ్లోర్ క్లీన్ చేస్తున్నప్పుడు ఇది నీటిలో కలిపితే చాలు.. చిటికెలో మీ ఇళ్లు సూపర్ సేఫ్

ఇంటి ఫ్లోర్ సూపర్ క్లీన్‌గా ఉంచుకోవడంతోపాటు నేల మెరిసేలా చేయాలంటే కొన్ని చిట్కాలను అనుసరించడం అవసరం. ఇళ్లు అందంగా.. ఆరోగ్యవంతంగా.. శుభ్రంగా ఉంచుకోవాలని

House Cleaning Tips: ఫ్లోర్ క్లీన్ చేస్తున్నప్పుడు ఇది నీటిలో కలిపితే చాలు.. చిటికెలో మీ ఇళ్లు సూపర్ సేఫ్
House Cleaning Tips

Edited By: Anil kumar poka

Updated on: Mar 02, 2023 | 4:29 PM

వేసవి మొదలైంది. దుమ్ము దూళి ఇంట్లోకి వచ్చి చేరుతుంది. ఇంది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఈ దుమ్ము దూళి ఇంట్లోకి రావడం వల్ల అస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. దుమ్ముతో చాలా సమస్యలు మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. మీ ఆరోగ్యంతోపాటు మీ కుటుంబ సభ్యులకు కూడా పెద్ద సమస్యగా మారుతాయి. ఇంటి ఫ్లోర్ సూపర్ క్లీన్‌గా ఉంచుకోవడంతోపాటు నేల మెరిసేలా చేయాలంటే కొన్ని చిట్కాలను అనుసరించడం అవసరం. ఇళ్లు అందంగా.. ఆరోగ్యవంతంగా.. శుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి గృహిని ఆలోచిస్తుంటారు. అందుకే ముందు నుంచే ఇంటిని శుభ్రం చేయడం మొదలు పెడుతారు. అయితే ఇంటిని శుభ్రపరచడం పెద్ద పని..  ఇలాంటి పని చేయాలంటే మంత్రం తరచుగా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎందుకంటే ఇంట్లోని వస్తువులను జరపాలి.. వాటి వెనుక దాగి ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ చేయాలి. ఇలాంటి చిక్కు సమస్యలకు.. కొన్ని చిన్ని చిట్కాలతో చెక్ పెట్టొచ్చు. వీటిని అనుసరించడం ద్వారా మీరు ఇంటిని మెరిసేలా చేయవచ్చు. ఇంట్లోని బూజును తొలగించవచ్చు.  అది ఎలానో ఓసారి తెలుసుకుందాం..

ఈ సమస్యను అధిగమించడానికి ఎలాంటి పద్ధతులు అనుసరిస్తే మంచిదో మనలో చాలా మందికి తెలియదు. అయితే ఈ ఆర్టికల్‌లో ఇచ్చిన కొన్ని చిట్కాలు మీకు చాలా ఉపయోగకరంగా ఉండవచ్చు. దీని సహాయంతో మీరు మీ ఇంటి నేలను తెల్లగా చేసుకోవచ్చు. ఇది ప్రకాశవంతంగా కూడా చేయవచ్చు. ఆ పద్ధతులు ఏంటో, వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

1. ఇంటి నేల మెరిసిపోవాలంటే బకెట్ నీళ్లలో నిమ్మరసం కలపాలి. తర్వాత నేలను శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల నేల మెరిసిపోవడమే కాకుండా నేలపై ఉండే మురికి పోతుంది.

2. నేల మెరిసేలా చేయడానికి మీరు బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. ఒక మగ్ నీటిలో బేకింగ్ సోడా పౌడర్ కలపండి. దానిని శుభ్రం చేయడానికి కాటన్ గుడ్డను ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల నేలను త్వరగా శుభ్రం చేసుకోవచ్చు. మరకలను కూడా తొలగించవచ్చు.

3. ఒక కప్పు నీటిలో కిరోసిన్ కలపండి. అందులో కాటన్ క్లాత్‌ను నానబెట్టండి. తర్వాత ఆ గుడ్డతో నేలపై మరకలను శుభ్రం చేయాలి. శుభ్రపరిచిన తర్వాత, గోరువెచ్చని నీటితో నేల కడగాలి. ఇలా చేయడం వల్ల నేలను శుభ్రం చేసుకోవచ్చు.

ఈ వస్తువులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి..

మీరు నేలను శుభ్రం చేసినప్పుడు రబ్బర్ గ్లౌజ్స్‌ ధరించండి. మందపాటి గుడ్డతో నేలను తుడవండి. ఒక సన్నని ఫాబ్రిక్ త్వరగా చిరిగిపోవచ్చు, అలాగే నేలను బాగా శుభ్రం చేయదు.

Note: ( ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఉంది. టీవీ9 NEWS దానిని ధృవీకరించలేదు.)

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం