మీరెప్పుడైనా చపాతీ తయారు చేసే యంత్రాన్ని చూశారా..? రెడీ టూ ఇట్‌..! ఆసక్తికరమైన వీడియో వైరల్‌…

|

Dec 01, 2023 | 9:55 PM

అయితే, ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు భిన్నమైన రీతిలో స్పందించారు.  చాలా మంది తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఇంట్లో చేత్తో చేసే రుచి రాదంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఏది ఏమైనప్పటికీ, అత్యంత రేట్ చేయబడిన, ఆసక్తికరమైన వీడియోను నెటిజన్లు ఎంతగానో ఇష్టపడుతున్నారు. లైకులు, షేర్లు చేస్తూ వీడియోని విపరీతంగా వైరల్‌గా మార్చేస్తున్నారు.

మీరెప్పుడైనా చపాతీ తయారు చేసే యంత్రాన్ని చూశారా..? రెడీ టూ ఇట్‌..! ఆసక్తికరమైన వీడియో వైరల్‌...
Roti Making
Follow us on

భారతీయ వంటకాల్లో చపాతీ అత్యంత ప్రముఖ్యత కలిగిన వంటకం. పూర్వం ప్రతి ఇంటిలో గోధుమలు కొని, కడిగి, ఎండబెట్టి పండి తయారు చేసుకుని చపాతీ చేసుకుని తినేవారు. ఇది చాలా ఆరోగ్యకరమైన పద్ధతి. కానీ మనం ప్రాసెస్ చేసిన గోధుమ పిండిని దుకాణాల నుండి నేరుగా కొనుగోలు చేసుకుంటున్నాం. దీంతోనే చపాతీలు చేసుకుని తినేస్తున్నాం. అయితే ఇప్పుడు ఇలా చపాతీ చేసే వారి సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. చపాతీ స్ప్రెడ్ లాగా తినగలిగే ప్యాకెట్లలో తేలికగా దొరికినప్పుడు పిండిని పిసికి, చపాతీలు చేయడానికి ఎందుకు ఇబ్బంది పడాలి.. అని చాలా మంది అనుకుంటారు. దీనికి ప్రధాన కారణం సమయం లేకపోవడమే చాలా మందికి పెద్ద సమస్య. ఇంట్లో పెద్దలందరూ ఉద్యోగాలకు వెళుతుంటే, పిల్లలు చదువుకుంటున్నారంటే, తప్పకుండా వారిది బిజీ లైఫ్ స్టైల్. అప్పుడు ప్యాకెట్ చపాతీలే శరణ్యం.

కానీ, ఈరోజు షాపుల్లో రెడీమేడ్‌ చపాతీలు కూడా దొరుకుతాయి. ఇది పారిశ్రామిక ప్రాతిపదికన తయారు చేయబడి ఉంటాయి. అయితే యంత్రాలతో ఇలా చపాతీలు ఎలా తయారు చేస్తారో చాలా మందికి తెలియదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకరు పెద్ద మెషిన్‌లో పిండిని పిసికి జస్ట్‌ కలిపేందుకు మాత్రమే మనుషులు నిలబడి ఉంటారు. అది కూడా తగినంత నీరు, నూనె పోయడానికి మాత్రమే పనిచేస్తారు. అన్ని కలిపి సమపాల్లలో పిండిని తడపటం చపాతీలు తయారు చేయటం అంత యంత్రం ద్వారానే చేస్తారు. దీని తరువాత పిండిని బయటకు తీసి రౌండ్‌ చపాతీలు తయారు చేయట కూడా అంతా యంత్రం ద్వారానే జరుగుతుంది. ఆ తర్వాత చపాతీలను మంటపై కాలుస్తారు. ఈ మనోహరమైన వీడియోను లక్షల మంది వీక్షించారు. చపాతీ రెడీ టు ఈట్ ఎలా చేస్తారో మీరు చూసేయండి..

ఇవి కూడా చదవండి

అయితే, ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు భిన్నమైన రీతిలో స్పందించారు.  చాలా మంది తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఇంట్లో చేత్తో చేసే రుచి రాదంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఏది ఏమైనప్పటికీ, అత్యంత రేట్ చేయబడిన, ఆసక్తికరమైన వీడియోను నెటిజన్లు ఎంతగానో ఇష్టపడుతున్నారు. లైకులు, షేర్లు చేస్తూ వీడియోని విపరీతంగా వైరల్‌గా మార్చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..