నేడు హెలెన్ కెల్లర్ డే.. వైరల్ ఫీవర్‌తో చూపు, వినికిడిని కోల్పోయిన కెల్లర్ స్పూర్తివంతమైన జీవితం గురించి తెలుసా..

|

Jun 27, 2024 | 9:22 AM

అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారథిగా ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హెలెన్ ఎందరెందరికో స్ఫూర్తిప్రదాత. హెలెన్ కెల్లర్ అంధురాలు. అంతేకాదు చెవిటి వారు కూడా.. తన జీవిత ప్రయాణానికి అవయవ లోపం అడ్డుకాదంటూ రచయితగా, సామజిక కార్యకర్తగా, లెక్చరర్‌గా ఎదిగి ఎందరికో స్పూర్తిగా నిలిచింది. ఆమె సాధించిన విజయాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం జూన్ 27న హెలెన్ కెల్లర్ డేగా జరుపుకుంటారు.

నేడు హెలెన్ కెల్లర్ డే.. వైరల్ ఫీవర్‌తో చూపు, వినికిడిని కోల్పోయిన కెల్లర్ స్పూర్తివంతమైన జీవితం గురించి తెలుసా..
Helen Keller Day
Image Credit source: GOOGLE
Follow us on

కొంతమందికి అన్ని అవయాలు, అందం చదువు, ఆస్తి, డబ్బులున్నా ఇంకా ఎదో లేదు అని తీవ్ర నిరాశతో నిండిపోయి తమ జీవితాన్ని గడిపేస్తారు. అదే సమయంలో కొంతమంది దివ్యాంగులు తమకు దేవుడి ఇచ్చిన అవయవలోపాన్ని అధిగమించి చరిత్రలో తమ కంటూ ఓ పేజీని లిఖించుకుంటారు. అలాంటి ఓ గొప్ప మహిళల్లో హెలెన్ కెల్లర్ ఒకరు. అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారథిగా ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హెలెన్ ఎందరెందరికో స్ఫూర్తిప్రదాత. హెలెన్ కెల్లర్ అంధురాలు. అంతేకాదు చెవిటి వారు కూడా.. తన జీవిత ప్రయాణానికి అవయవ లోపం అడ్డుకాదంటూ రచయితగా, సామజిక కార్యకర్తగా, లెక్చరర్‌గా ఎదిగి ఎందరికో స్పూర్తిగా నిలిచింది. ఆమె సాధించిన విజయాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం జూన్ 27న హెలెన్ కెల్లర్ డేగా జరుపుకుంటారు. ఈ రోజు కెల్లర్ అద్భుతమైన ప్రతిభ, తెలివితేటలు, ఆమె పడిన తపన అంకితభావాన్ని గుర్తు చేస్తుంది. ఆమెను గౌరవించడానికి ప్రతి ఏడాది హెలెన్ కెల్లర్ డే ని జరుపుకుంటారు.

హెలెన్ కెల్లర్ డే 2024

జూన్ 27వ తేదీ 1880లో హెలెన్ కెల్లర్ జన్మించింది. ఆమె పుట్టిన తేదీని ప్రతి ఏడాది హెలెన్ కెల్లర్ డే గా జరుపుకుంటారు. ఇది ఆమె అసాధారణ ప్రతిభకు అద్దం పట్టే రోజు.. ఆమె కృషి పట్టుదలకు ప్రతిబింబించే రోజుగా నిలుస్తుంది. అంతేకాదు ఈ రోజుని వైకల్యాలున్న వ్యక్తుల సామర్థ్యాలు, హక్కుల గురించి అవగాహన కల్పించడానికి నిర్ధించిన రోజు.

హెలెన్ కెల్లర్ డే 2024: చరిత్ర

హెలెన్ కెల్లర్ జూన్ 27, 1880న అలబామాలోని టుస్కుంబియాలో జన్మించారు. 19 నెలల వయస్సులో ఆమె స్కార్లెట్ ఫీవర్ బారిన పడింది. ఈ వైరల్ ఫీవర్ వలన ఆమె కంటి చూపుని, వినికిడి సామర్ధ్యాన్ని కోల్పోయింది. తీవ్రమైన వైకల్యాలతో ఇబ్బంది పడుతున్న హెలెన్ కెల్లర్ జీవితం ఏడేళ్ళ ప్రయాణంలో సరికొత్త అడుగులు వేసే విధంగా మారిపోయింది. 1887లో కెల్లర్ కు అన్నే సుల్లివన్‌ అనే టీచర్ తో పరిచయం అయింది. దీంతో కెల్లర్ జీవితం నాటకీయంగా మారిపోయింది. సుల్లివన్.. కెల్లర్‌కు సంకేత భాషలో కమ్యూనికేట్ చేయడం నేర్పించింది. తరువాత కెల్లర్ బ్రెయిలీ లిపిలో చదవడం మరియు వ్రాయడం నేర్చుకుంది.

ఇవి కూడా చదవండి

కెల్లర్ సాధించిన సంచలనాత్మకమైన విజయాలు

కెల్లర్ 1904లో రాడ్‌క్లిఫ్ కాలేజీ నుండి పట్టభద్రురాలైంది. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టాను అందుకున్న మొదటి చెవిటి-అంధురాలు. కెల్లర్ తన జీవితాన్ని వివరిస్తూ ఆమె తన ఆత్మకథ “ది స్టోరీ ఆఫ్ మై లైఫ్”తో సహా అనేక పుస్తకాలను రచించింది. లా చదివిన కెల్లర్ వికలాంగులు, మహిళల హక్కులు, సామాజిక న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేసింది. సామజిక కార్యకర్తగా ఆమె అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్ వంటి సంస్థలతో కలిసి పనిచేశారు.

హెలెన్ కెల్లర్ చేసిన సేవలకు గుర్తింపుగా ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ 1980లో జూన్ 27వ తేదీని హెలెన్ కెల్లర్ డేగా ప్రకటించారు. ఆది కెల్లర్ 100వ వార్షిక జన్మదినోత్సవం. కెల్లర్ ప్రతిభను పట్టుదలను గుర్తు చేసే విధంగా హెలెన్ కెల్లర్ డే జరుపుకోవడం.. ఆమె ప్రాముఖ్యతను హైలైట్ చేసింది.

హెలెన్ కెల్లర్ చెప్పిన ప్రతిభావంతులైన కోట్స్

  1. హెలెన్ కెల్లర్ మాటలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరి మదిలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరినీ ప్రేరేపించే అత్యంత శక్తివంతమైన కొన్ని కోట్స్ ను తెలుసుకుందాం
  2. ప్రపంచంలోని అత్యుత్తమమైన, అందమైన వస్తువులను చూడలేరా లేదా తాకలేరా.. అప్పుడు వాటిని హృదయం తెరచి చూసినట్లు అనుభూతి చెందాలి.”
  3. ఒక్కరం చేసే పని తక్కువగా ఉంటుంది.. అదే అందరం కలిసి చేస్తే ఎటువంటి పని అయినా చేయడం సులభం”
  4. ఆశావాదం అనేది విజయానికి దారితీసే విశ్వాసం. ఆశ, విశ్వాసం లేకుండా ఏమీ చేయలేము.”
  5. జీవితం ఒక సాహసోపేతమైన సాహసం
  6. ప్రపంచం అనేక రకాల బాధలతో నిండినప్పటికీ.. దానిని అధిగమించడం కూడా నిండి ఉంటుంది
  7. ముఖం వెలుగుకి దగ్గరగా ఉంటే నీడ ఏర్పడదు.

 

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..