ప్రేమించడం.. హీరోయిజం అనుకోవడం.. పెళ్లి మాటెత్తగానే సైడయిపోవడమే.. తాజాగా ఇలాంటి ఘటననే ఒకటి తెలంగాణలో వెలుగుచూసింది. ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు ముఖం చాటేశాడు. కలిసి తిరిగి, సహాజీవనం చేసిన రోజులు మరిచిపోయాడు. పెళ్ళి మాట ఎత్తేసరికి మాయమైపోయాడు. దీంతో చేసేదీ లేక ఓ ప్రియురాలు అతడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. వరంగల్ జిల్లాలో జరిగిందీ ఘటన.
నీటా టెక్స్‌టైల్స్ యజమాని గోవిందరాజ్ పాలకుర్తికి చెందిన ఓ మహిళను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. మూడు సంవత్సరాలుగా కలిసి ఉండి రెండు సార్లు అబార్షన్ కూడా చేయించాడని వాపోయింది బాధిత మహిళ. పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేయడంలో ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. గతంలోనూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది.
శుక్రవారం మే 24వ తేదీ రాత్రి నుండి ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపింది అమ్మాయి. దీంతో ఇంటికి తాళం వేసుకుని బయటికి వెళ్లిపోయిన గోవిందరాజ్ కుటుంబం. అమె మహిళా సంఘాలు అండగా నిలవడంతో న్యాయ పోరాటానికి సిద్ధమైంది. తనకు న్యాయం జరిగే వరకు కదిలేదీ లేదని తేల్చి చెప్పింది బాధితురాలు.
వీడియో ఇదిగో…
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…