Garlic Price Hike: పెరుగుతున్న వెల్లుల్లి ధర.. మరింత పెరిగే అవకాశం ఉందంటూ రైతులు హర్షం..

ధర పెరగడంతో మండీలకు వెల్లుల్లి రాక పెరిగింది . అధిక ధర ఉండడంతో వెల్లుల్లిని విక్రయించేందుకు రైతులు భారీ సంఖ్యలో మండికి చేరుకుంటున్నారు. ఇదే సమయంలో రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

Garlic Price Hike: పెరుగుతున్న వెల్లుల్లి ధర.. మరింత పెరిగే అవకాశం ఉందంటూ రైతులు హర్షం..
Garlic Price Hike

Updated on: Jun 16, 2023 | 7:28 AM

ఓ వైపు టమాటా ధర క్రమంగా పెరుగుతూ ఉంటె.. ఇప్పుడు వెల్లుల్లి వంతు వచ్చింది. క్రమంగా వెల్లుల్లి ధర భారీగా పెరుగుతూ ఉంది. ముఖ్యంగా వెల్లుల్లి అధికంగా పండించే రాజస్థాన్ లో వెల్లుల్లి ధర పెరుగుతుంది. దీని ప్రభావం దేశ వ్యాప్తంగా పడనుందని తెలుస్తుంది. ధర పెరగడంతో మండీలకు వెల్లుల్లి రాక పెరిగింది . అధిక ధర ఉండడంతో వెల్లుల్లిని విక్రయించేందుకు రైతులు భారీ సంఖ్యలో మండికి చేరుకుంటున్నారు. ఇదే సమయంలో రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. విశేషమేమిటంటే, ప్రతాప్‌గఢ్ మార్కెట్‌లో వెల్లుల్లి ధరలో ఈ పెరుగుదల ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో వెల్లుల్లి పండించే రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు .

దైనిక్ భాస్కర్ నివేదిక ప్రకారం.. గత వారం రోజులుగా వెల్లుల్లి ధరలో భారీ పెరుగుదల కనిపిస్తోందని మార్కెట్ కమిటీ కార్యదర్శి మదన్ లాల్ గుర్జార్ తెలిపారు. ఇప్పుడు మార్కెట్‌లో క్వింటాల్ వెల్లుల్లి ధర రూ. 13000కు చేరుకుంది. దీంతో రైతులు పండించిన పంటలను విక్రయించేందుకు పెద్దఎత్తున మార్కెట్‌కు వస్తున్నారు. మార్కెట్‌కు రోజూ దాదాపు 1500 బస్తాల వెల్లుల్లి వస్తోంది. రానున్న రోజుల్లో వెల్లుల్లి రేటు మరింత పెరగనుందని వెల్లుల్లి వ్యాపారి తెలిపారు. అదే సమయంలో ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా వెల్లుల్లి ఎగుమతి ప్రారంభమైంది.

బారా జిల్లాలో 30 వేల 420 హెక్టార్లలో రైతులు వెల్లుల్లి సాగు 

ఇవి కూడా చదవండి

అదే సమయంలో గత సంవత్సరం రాజస్థాన్‌లో వెల్లుల్లి పండించే రైతులకు మంచి ధర లభించలేదు. ప్రభుత్వం నుంచి మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ ఆమోదం పొందినా రైతులకు సరైన ధర లభించలేదు. కిలో వెల్లుల్లిని రూ.14కు విక్రయించాల్సిన దుస్థితిని రైతులు ఎదుర్కొన్నారు. రాజస్థాన్‌లో రైతులు 1.31 లక్షల హెక్టార్లలో వెల్లుల్లిని పండిస్తున్నారు. బుండి, ఝలావర్, కోట, బారా, హదౌతి ప్రాంతాల్లో రైతులు అత్యధికంగా వెల్లుల్లిని సాగు చేస్తారు. దేశంలో 90 శాతం వెల్లుల్లి ఈ ప్రాంతాల నుంచే ఉత్పత్తి అవుతుంది. ఈసారి బారా జిల్లాలో 30 వేల 420 హెక్టార్లలో రైతులు వెల్లుల్లిని సాగు చేశారు.

మరోవైపు పెరిగిన టమాటా ధర:

రాజస్థాన్‌లో వెల్లుల్లి ధర పెరుగుతోంది.. మరోవైపు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో కూడా టమోటాలు కూడా ఖరీదైనవిగా మారాయి. కిలో రూ.30కి లభించే టమాట ధర ఇప్పుడు రూ.60కి చేరింది. ప్రస్తుతం వ్యాపారులు ఎక్కువ ధరకు రైతుల నుంచి టమోటాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టమోటా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..