Gift for Married Couple: స్నేహితుల పెళ్లికో.. బంధువుల పెళ్లికో వెళితే సహజంగానే ఏదో ఒక బహుమతిని ఆ నవదంపతులకు అంజదేస్తాం. ఇక క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఊహించని గిఫ్ట్‌లతో నవ దంపతులను సర్‌ప్రైజ్ చేస్తారు. తమదైన స్టైల్‌లో సరికొత్త బహుమతులు ఇస్తుంటారు. తాజాగా తమిళనాడులో పెళ్లి చేసుకున్న ఓ జంటకు వారి ఫ్రెండ్స్ అలాంటి గిఫ్ట్ ఇచ్చే షాక్‌కు గురిచేశారు. ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ అంశాలు పెట్రోల్, గ్యాస్, కూరగాయల ధరలు. రోజు రోజుకు వీటి ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఆ నవ దంపతులకు వీటినే గిఫ్ట్‌గా ఇవ్వాలని ఆ ఫ్రెండ్స్ భావించారు.
ఇంకేముందు మనసులో వచ్చిన ఆలోచనను వారి ఆచరణలోనూ పెట్టారు. పెళ్లి స్టేజీపై ఉన్న వధూవరులకు వారి ఫ్రెండ్స్.. పెట్రోల్, గ్యాస్, ఉల్లిపాయలను బహుమతిగా అందజేశారు. పెట్రోల్ బాటిల్‌ను, గ్యాస్ సిలిండర్‌ను చేతికి అందివ్వగా.. ఉల్లిపాయల దండను వారి మెడలో వేశారు. అది చూసి నవదంపతులు నవ్వు ఆపుకోలేకపోయారు. వధువు అయితే తనకు వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ్ వైరల్ అవుతోంది. దానిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘అవి చాలా ఖరీదైన కానులకు, భద్రంగా దాచుకోండి’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఇదిలాఉంటే.. గత కొంతకాలంగా దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు, కురగాయల ధరలు విపరీతంగ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. వంట గ్యాస్ ధరలు రూ. 1000 కి చేరువ అవుతుండగా.. పెట్రోల్ రూ. 100 కి చేరింది. ఈ నేపథ్యంలో ఆ నవదంపతులు ఇలా సెటైరికల్‌గా ఆలోచించి ఈ బహుమతులను ప్రదానం చేశారు.
Viral Tweet:
Couple gets Petrol, Gas Cylinder and Onions as a Wedding Gift in Tamilnadu. pic.twitter.com/IWxqDRXy1s
— बेरोजगार मनराज सिंह (@manraj_mokha) February 18, 2021
Also read:
యూఎస్ లో గ్రీన్ కార్డులు కోరేవారికి శుభవార్త ! త్వరలో రానున్న కొత్త చట్టం, బైడెన్ సంతకమే తరువాయి
Post Office Scheme: పోస్టాఫీసులో రోజూ రూ . 411 జమ చేయడం.. ఆ తర్వాత రూ .43.60 లక్షలు పొందండి..