Vastu Tips: ఇంట్లో మొక్కలు పెంచుతున్నారా.? ఈ తప్పులు చేశారేమో చూసుకోండి

|

Jan 21, 2024 | 6:24 PM

మార్కెట్లో అన్ని రకాల మొక్కలు అందుబాటులో ఉంటుండడంతో ప్రజలు ఇంట్లో మొక్కలు పెంచుకోవడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇంటేనే చిన్న సైజ్‌ గార్డెన్‌గా మార్చుకుంటున్నారు. అయితే మొక్కలు పెంచుతకుంటున్నారు బాగానే ఉంది. కానీ ఇంట్లో...

Vastu Tips: ఇంట్లో మొక్కలు పెంచుతున్నారా.? ఈ తప్పులు చేశారేమో చూసుకోండి
Vastu Tips
Follow us on

ఒకప్పుడు ఇంటి వెనక పెరట్లో మొక్కలు పెంచుకునే వారు. కానీ ఇప్పుడు అపార్ట్‌మెంట్‌ కల్చ్‌ రాకతో ఇంట్లోనే మొక్కలు పెంచుకునే రోజులు వచ్చేశాయ్‌. మార్కెట్లో అన్ని రకాల మొక్కలు అందుబాటులో ఉంటుండడంతో ప్రజలు ఇంట్లో మొక్కలు పెంచుకోవడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇంటేనే చిన్న సైజ్‌ గార్డెన్‌గా మార్చుకుంటున్నారు. అయితే మొక్కలు పెంచుతకుంటున్నారు బాగానే ఉంది. కానీ ఇంట్లో పెంచే మొక్కల విషయంలోనూ వాస్తు వర్తిస్తుందని మీకు తెలుసా.? అవును ఏ దిశలో పడితే ఆ దిశలో మొక్కలను పెంచడం మంచిది కాదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంతకీ వాస్తు శాస్త్రం ప్రకారం ఏ మొక్కను ఏ దిశలో నాటితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

* దాదాపు ప్రతీ ఒక్క హిందువు ఇంట్లో తులసి మొక్క కచ్చితంగా ఉంటుంది. తులసిని పూజించడం అనవాయితీగా వస్తుంది. ఎంతో పవిత్రంగా భావించే తులసి మొక్క విషయంలో కచ్చితంగా వాస్తును పాటించాలని వాస్తు పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి స్వయంగా నివాసం ఉంటుందని విశ్వసించే తులసి మొక్కను ఇంటికి దక్షిణ భాగంలో పెట్టుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. ఒకవేళ దక్షిణంలో వీలుకాకపోతే ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో తులసి మొక్క ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

* ఈ మధ్య కాలంలో చాలా మంది ఇళ్లలో మనీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంట్లో మనీ ప్లాంట్‌ ఉంటే ఆర్థికంగా బాగుంటుందని విశ్వసిస్తున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ దిశలో ఉండకుండా చూసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు, మానసికమైన సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. వీలైనంత వరకు మనీ ప్లాంట్‌ను ఆగ్నేయ దిశలో ఉంచితే మంచిదని చెబుతున్నారు.

* ఇక ఆర్గానిక్‌ వ్యవసాయం పేరుతో ఇటీవల కొందరు ఇంట్లోనే అరటి చెట్లను సైతం పెంచుతున్నారు. అరటి చెట్టు ఉన్న ప్రదేశంలో మంచి జరుగుతుంది అని అంటారు కానీ అది దక్షిణ దిశలో అసలు ఉండకూడదు. ఇలా ఉండడం వల్ల మానసికమైన చికాకులు ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. ఎప్పుడు కూడా అరటి మొక్కను ఉత్తరం లేక తూర్పు దిశలో ఉండేలా చూసుకోవాలి.

* ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రకాల చెట్లను పెంచకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. వీటిలో ప్రధానమైంది చింతచెట్టు. ఈ చెట్టు ప్రతికూల శక్తులను అట్రాక్ట్ చేస్తుందని కాబట్టి ఈ చెట్టును ఇంట్లో పెంచుకోకూడదని చెబుతున్నారు. ఇక ఇంట్లో పెంచకూడని మరో మొక్క పత్తి. పత్తి మొక్క ఇంట్లోకి దురదృష్టాన్ని తెస్తుంది. సుఖ, సంతోషకరమైన కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో శాస్త్రీయత లేదని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం క్లిక్ చేయండి..