Kitchen Hacks: గ్యాస్‌ స్టవ్‌ బర్నర్‌లో సమస్యలా.. వంటింటి చిట్కాలతోనే చెక్‌..

మంట సరిగ్గా రాకపోడం, మధ్య మధ్యలో మంట ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. దీంతో చాలా మంది బర్నర్‌ పాతపడిందని కొత్తవి తీసుకుంటారు. అయితే కొన్ని సింపుల్‌ చిట్కాలను పాటించడం ద్వారా బర్నర్‌ను సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. కేవలం బర్నర్‌ మాత్రమే కాకుండా స్టవ్‌పై పేరుకుపోయిన జిడ్డును కూడా తొలగించవచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే..

Kitchen Hacks: గ్యాస్‌ స్టవ్‌ బర్నర్‌లో సమస్యలా.. వంటింటి చిట్కాలతోనే చెక్‌..
Burner Cleaning Tips

Updated on: Nov 25, 2023 | 3:02 PM

గ్యాస్‌ స్టవ్‌ లేనిది రోజు గడవని పరిస్థితి. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు గ్యాస్‌ స్టవ్‌తో పని ఉంటుంది. అయితే గ్యాస్‌ స్టవ్‌ను ఉపయోగించే క్రమంలోనే ఎదురయ్యే ప్రధాన సమస్య బర్నర్‌లు సరిగ్గా పనిచేయకపోవడం. కాలక్రమేణ బర్నర్‌ ఉపయోగించే కొద్దీ సమస్యలు వస్తుంటాయి.

మంట సరిగ్గా రాకపోడం, మధ్య మధ్యలో మంట ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. దీంతో చాలా మంది బర్నర్‌ పాతపడిందని కొత్తవి తీసుకుంటారు. అయితే కొన్ని సింపుల్‌ చిట్కాలను పాటించడం ద్వారా బర్నర్‌ను సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. కేవలం బర్నర్‌ మాత్రమే కాకుండా స్టవ్‌పై పేరుకుపోయిన జిడ్డును కూడా తొలగించవచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే..

* స్టవ్‌పై పేరకుపోయిన జిడ్డును తొలగించాలంటే ముందుగా కొన్ని ఉల్లిపాయ ముక్కలను గుండ్రంగా కట్ చేసుకోవాలి. వీటిని వేడి నీటిలో 20 నిమిషాలు ఉడకబెట్టండి. అనంతరం నీరు చల్లారిన తర్వాత ఉల్లిపాయలతో స్టవ్‌ను తుడిస్తే చాలు ఎంతటి జిడ్డైనా ఇట్టే క్లీన్‌ అవుతుంది.

* ఇక బర్నర్‌పై కొన్ని వెనిగర్‌చుక్కలను వేయాలి. కాసేపు అలాగే ఉంచిన తర్వాత స్పాంజితో బర్నర్‌ను తుడవాలి. అనంతరం డిష్వాషింగ్ లిక్విడ్ లేదా సబ్బుతో కడిగెయ్యాలి. దీంతో గ్యాస్ బర్నర్ తళుక్కుమంటుంది.

* బర్నర్‌లను శుభ్రం చేసుకోవాలంటే ముందుగా బేకింగ్ సోడాతో నిమ్మరసం , వెనిగర్ కలపాలి. అనంతరం దీంతో గ్యాస్ స్టవ్‌తో పాటు బర్నర్ బాగా తుడవాలి. ఇలా చేస్తే బర్నర్‌ క్లీన్‌ అవుతుంది.

* ఒక పాత్రలో ముందుగా వేడి నీటిని తీసుకోవాలి అనంతరం అందులో ఉప్పు కలపాలి. బర్నర్‌లను ఆ నీటిలో ముంచాలి. నీటిని 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడకబెట్టాలి. చివరిగా స్క్రబ్బర్‌తో క్లీన్ చేస్తే సరిపోతుంది.

* బర్నర్‌ను క్లీన్‌ చేయడానికి ఒక గిన్నెలో నీరు తీసుకోండి. తర్వాత వైట్ వెనిగర్ , బేకింగ్ సోడా కలపాలి. ఇందులో బర్నర్‌లను రెండు గంటలపాలు నానబెట్టాలి. తర్వాత టూత్ బ్రష్‌తో స్క్రబ్‌ చేస్తే శుభ్రమవుతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..