వంటింట్లో కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మీ పనిని మరింత సులువు చేసుకోవచ్చు. ఆహార పదార్థాలను ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవాలన్నా, రుచిగా మార్చుకోవాలన్నా కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే మంచి లాభాలు పొందొచ్చు. ఈ చిట్కాలు పాటిస్తే ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవడంతో పాటు, ఆహారం రుచి కూడా పెరుగుతుంది. ఇలాంటి కొన్ని వంటింటి చిట్కాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు మీకోసం..
సాధారణంగా పచ్చి మిరకాయలు ఎక్కువ కాల నిల్వ ఉంచితే.. ఎరుపు రంగులోకి మారుతాయి. అయితే ఇలా మారకుండా చేసుకోవడం కోసం ఒక చిట్కా అందుబాటులో ఉంది. ఇందుకోసం పచ్చి మిరపకాయల్ని సీసాలో నిలువ చేసే సమయంలో కాసింత పసుపు చేర్చాలి. ఇలా చేయడం వల్ల పచ్చి మిరపకాయలు ఎరుపు రంగులోకి మారవు. ఇక వర్షకాలంలో ఉప్పు చెమ్మ చేరి నీరు కారిపోకుండా ఉండాలంటే.. ఉప్పు ఉన్న జాడీలో రెండు పచ్చిమిరపకాయలు వేయాలి.
పెరుగు పుల్లగా మారకుండా ఉండాలంటే పెరుగులో కొబ్బరిముక్కను వేయాలి. ఇక పెరుగు తోడు పెట్టేముందు గిన్నెకు పటిక ముక్కతో రుద్దాలి ఇలా చేయడం వల్ల పెరుగు రుచిగా, సరిగ్గా తోడుకుంటుంది. ఒకవేళ పెరుగు బాగా పులుపుగా అయితే అందులో కొన్ని పాలు కలుపుకుంటే రుచిలో మార్పు గమనించవచ్చు. ఎల్లుల్లి రేకులను ఎండలో కొద్ది సేపు ఉంచితే తీస్తే సులువుగా తీయొచ్చు. దోసెలపిండిలో ఒక కప్పు సగ్గుబియ్యం కూడా వేసి రుబ్బితే, దోసెలు చిరగకుండా పల్చగా వస్తాయి. ఇక దోసెలు పెనానికి అతుక్కుపోకుండా ఉండాలంటే.. ముందుగా పెనంపై వంకాయ ముక్కతో రుద్దితే సరిపోతుంది.
ఆమ్లెట్ పెద్దగా పొంగినట్లు రావాలంటే గ్రుడ్డుసొనకి ఒక టీస్పూన్ మైదాపిండి కలిపితే చాలు. మనలో కొందరు ఆమ్లెట్ వేసే సమయంలో గుడ్డు సొనలో పాలు కలుపుతారు. అయితే పాలు కలిపితే ఆమ్లెట్ గట్టిపడుతుంది. పాలకు బదులుగా ఒక చెంచా నీళ్ళు కలిపితే ఆమ్లెట్ మెత్తగా ఉంటుంది. కోడి గుడ్లను ఉడికించే సమయంలో నీటిలో కాస్తు ఉప్పు వేస్తే పెంకు సులభంగా తీయొచ్చు. ఉడకబెట్టే సమయంలో కోడి గుడ్డు పగిలితే… ఉడకపెట్టడానికి రెండు గంటల ముందు ఫ్రిజ్‌లో ఉంచి తీస్తే పగిలే అవకాశం ఉండదు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..