Mileage Tips: వాహనంలో పెట్రోల్, డీజిల్ ఈ సమయంలో కొట్టిస్తే డబుల్ బెనిఫిట్ ఉంటుందట..!

|

May 23, 2023 | 2:20 PM

అసలే ధరాఘాతం.. చుక్కలనంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో జనాల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అందుకే ప్రజలు తమ వాహనాలను బయటకు తీయాలంటేనే జంకుతున్నారు. చాలా పొదుపుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమయంలో మైలేజీ ఎక్కువగా ఇచ్చే వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఎవరికైనా మైలేజీ ఎక్కువ రావాలనే కోరుకుంటారు.

Mileage Tips: వాహనంలో పెట్రోల్, డీజిల్ ఈ సమయంలో కొట్టిస్తే డబుల్ బెనిఫిట్ ఉంటుందట..!
Fuel Filling
Follow us on

అసలే ధరాఘాతం.. చుక్కలనంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో జనాల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అందుకే ప్రజలు తమ వాహనాలను బయటకు తీయాలంటేనే జంకుతున్నారు. చాలా పొదుపుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమయంలో మైలేజీ ఎక్కువగా ఇచ్చే వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఎవరికైనా మైలేజీ ఎక్కువ రావాలనే కోరుకుంటారు. ఈ మైలేజీ వెహికల్ పరంగానే కాదు.. ఇంధనం నింపుకునే సమయం వేళలలు కూడా ప్రభావితం చేస్తాయట. అవును.. పెట్రోల్, డీజిల్ నింపుకోవడానికీ ఓ సమయం ఉందని చాలామంది వాదన. కొందరు ఉదయం వేళ పెట్రోల్ నింపిస్తే మేలు అని చెబుతుంటారు. మరికొందరు రాత్రి పెట్రోల్ నింపిస్తే బెటర్ అని అంటారు. మరి ఏ సమయంలో పెట్రోల్ నింపితే ప్రయోజనం ఉంటుంది? ఈ వాదనల్లో నిజమెంత? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అసలు నిజం ఏంటి?

ప్రజల అభిప్రాయం ప్రకారం.. ఇంధనం కూడా సంకోచ, వ్యాకోచ గుణాన్ని కలిగి ఉంటుంది. వేడి కారణంగా ఇంధనం పలుచగా మారుతుంది. అదే ఉదయం వేళ తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా కాస్త చిక్కగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో పెట్రోల్ నింపడం వల్ల తక్కువ డబ్బుకే సాధారణం కంటే కొంచెం ఎక్కువ పెట్రోల్ వస్తుందని వీరి వెర్షన్.

సమ ఉష్ణోగ్రతల వద్ద ఇంధనం..

అయితే, వాస్తవానికి పెట్రోల్, డీజిల్ స్టేషన్లు.. ఇంధనాన్ని భూమికి దిగువన ట్యాంకులను ఏర్పాటు చేసి నిల్వ ఉంచుతాయి. తద్వారా.. అక్కడ పెట్రోల్, డీజిల్‌ స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది. ఇక ఈ ట్యాంకులు చాలా మందపాటి టేయర్లతో తయారచేస్తారు.

ఇవి కూడా చదవండి

ఇదీ అసలు వాస్తవం..

సమ ఉష్ణోగ్రత వద్ద ఇంధనాన్ని భద్రపరచడం వల్ల.. ఇంధనంపై ఉష్ణోగ్రత ప్రభావం చూపదు. పెట్రోల్, డీజిల్ సాంద్రతలో ఏ తేడా ఉండదు. ఈ కారణంగా.. మీరు పగటిపూట పెట్రోల్ కొనుగోలు చేసినా? రాత్రి సమయంలో పెట్రోల్ కొనుగోలు చేసినా? ఏం తేడా ఉండదు అని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..