Digital Humans: ఆర్డర్ వేస్తే క్షణాల్లో వర్క్ కంప్లీట్ చేసే ‘చిట్టి’ లాంటి డిజిటల్ హ్యుమన్స్ వచ్చేస్తున్నారు! ఇక మనిషి పని అవుటేనా?

| Edited By: Janardhan Veluru

Nov 23, 2023 | 7:15 PM

దిగ్గజ దర్శకుడు శంకర్ చెక్కిన కళాఖండం రోబో సినిమా. అందులో మనిషిలా ఆలోచించే రోబో చిట్టిని హీరో తయారు చేస్తాడు. అప్పట్లో అదో వింత. అదంతా సైన్స్ ఫిక్షన్ అని సాధ్యం కాదని అంతా అనుకున్నారు. అయితే అది త్వరలోనే రియాలిటీలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనిషిలా ఆలోచించి, నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వాషింగ్, క్లీనింగ్, ఎంతో నైపుణ్యంగా వైద్యుల మాదిరిగా సర్జరీలు, విద్యార్థులు, శిక్షణార్థులకు పాఠాలు బోధించడం వంటివి అచ్చం మనిషిలా చేసేయగలవని నిపుణులు చెబుతున్నారు. 2100నాటికి ఇది మనం ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉందని చెబుతున్నారు.

Digital Humans: ఆర్డర్ వేస్తే క్షణాల్లో వర్క్ కంప్లీట్ చేసే ‘చిట్టి’ లాంటి డిజిటల్ హ్యుమన్స్ వచ్చేస్తున్నారు! ఇక మనిషి పని అవుటేనా?
Ai Enabled Humanoids
Follow us on

టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రతి రోజూ ఏదో కొత్త అడ్వాన్స్ డ్ టెక్నాలజీ మనిషికి పరిచయం అవుతూనే ఉంది. ఇదే వేగంతో అభివృద్ధి కొనసాగితే 21వ శతాబ్దం పూర్తయ్యే నాటికి ప్రపంచం సరికొత్త టెక్నాలజీతో కూడిన వింతలను చూసే అవకాశం ఉంది. 2100 చివరి నాటికి తమ లాంటి డిజిటల్ మనషులను చూసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనికి బలం చేకూర్చుతూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధస్సు) మనిషిని ప్రభావితం చేయడం ప్రారంభించింది. మనిషి చేసే ప్రతిపనిని ఎంతో చాకచక్యంగా, అంతకు మించిన పరిణితితో, 100శాతం సక్సెస్ రేటుతో ఏఐ టూల్స్ నిర్వహిస్తుండటం ఇక్కడ గమనించాల్సిన విషయం. వీటన్నంటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనిషిని పోలిన ఏఐ ఆధారిత రోబో వచ్చేస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇవి మనిషిలాగే స్మార్ట్ మెంటార్స్ గానూ ఉండగలవు.. నిర్ణయాలు స్వతహాగా తీసుకోగలవు. ఇది సైన్స్ ఫిక్షన్ లా ఉండవచ్చు గానీ.. త్వరలోనే రియాలిటీలోకి వచ్చే అవకాశం ఉంది.

దిగ్గజ దర్శకుడు శంకర్ చెక్కిన కళాఖండం రోబో సినిమా. అందులో మనిషిలా ఆలోచించే రోబో చిట్టిని హీరో తయారు చేస్తాడు. అప్పట్లో అదో వింత. అదంతా సైన్స్ ఫిక్షన్ అని సాధ్యం కాదని అంతా అనుకున్నారు. అయితే అది త్వరలోనే రియాలిటీలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనిషిలా ఆలోచించి, నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వాషింగ్, క్లీనింగ్, ఎంతో నైపుణ్యంగా వైద్యుల మాదిరిగా సర్జరీలు, విద్యార్థులు, శిక్షణార్థులకు పాఠాలు బోధించడం వంటివి అచ్చం మనిషిలా చేసేయగలవని నిపుణులు చెబుతున్నారు. 2100నాటికి ఇది మనం ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఐదు టెక్నాలజీలు..

రానున్న కాలంలో ఐదు రకాల టెక్నాలజీలు ప్రపంచాన్ని శాసించే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనావేస్తున్నారు. ఆ టెక్నాలజీలు డిజిటల్ హ్యుమన్స్ తయారీకి దోహదం చేస్తాయని రాబ్ సిమ్స్ సీఈఓ సమ్ వివాస్ అన్నారు. ఈ డిజిట్ హ్యుమన్స్ కనుక ప్రపచంలోకి వస్తే ఇక ఎటువంటి సూచనలు వాటికి ఇవ్వాల్సిన అవసరం ఉండదని చెప్పుకొచ్చారు. తద్వారా అది ఒక ఎడ్యూకేటర్ లా, సపోర్టర్ లా, సమూహాల్లో కలిసిపోయి ప్రతి రోజూ జీవితంలో మనిషితో పాటు భాగం అయిపోతాయని వివరించారు.

ఇవి కూడా చదవండి

అలాగే ఇవి రోజూ వారి పనులు కూడా చేసిపెడతాయని నిపుణులు వివరించారు. వాషింగ్, క్లీనింగ్ తో పాటు ఎంతో నైపుణ్యంతో చేయాల్సిన వివిధ రకాల సర్జరీలు, ఉన్నత చదువులకు సంబంధించిన పాఠాలు బోధిస్తాయని చెబుతున్నారు. ఏఐ ఆధారంగా పనిచేసే ఈ డిజిటల్ హ్యూమన్స్, రోబోటిక్ హ్యూమనాయిడ్స్ 2100 నాటికి కొత్త సాధారణ వస్తువులుగా మనుషులతో కలిసపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఏఐ మెంటర్స్..

డిజిటల్ హ్యూమన్స్, రోబోటిక్ హ్యూమనాయిడ్స్ ఏఐ మెంటార్స్ కూడా పిలిచే అవకాశం ఉందని పుష్ ఫార్ సీఈఓ ఎడ్ జాన్సన్ చెప్పుకొచచారు. మనుషులు తీసుకునే తరహాలో సొంతంగా అవే నిర్ణయాలు తీసుకుంటాయని చెబుతున్నారు. విద్యార్థులకు, శిక్షణార్థులకు మెంటార్స్ గా అవే మారతాయని, వ్యక్తుల పరిస్థితులను అనలైజ్ చేసి తగిన సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు టిప్స్ అందిస్తాయని వివరించారు.

చివరి నిర్ణయం మనిషిదే..

2100 చివరి నాటికి ఏఐ ఆధారిత రోబోటిక్స్ ప్రపంచాన్ని శాసిస్తాయని చెబుతూనే.. చివరి నిర్ణయం మనిషిదే అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే మనిషి పని చేసే విధానంలో మార్పులు సంభవిస్తాయంటున్నారు. ఏఐ సాయంతో పని సులభతరం అవుతుందని, వేగంగా పూర్తవుతుందని అయితే.. ఫైనల్ రిపోర్టు, లేదా అవుట్ కం ఏదైతే ఉందో మనిషే క్రాస్ చెక్ నిర్ణయం తీసుకునేలా సాంకేతికత ఉంటుందని చెబుతున్నారు. ఇవి మనిషి కోసం అండర్ గ్రౌండ్లో పనిచేయగలుగుతాయని, టన్నెల్స్ తవ్వడం వంటి పనులు వీటి చేత చేయించే అవకాశం ఉందని వివరిస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..