వాష్ బేసిన్‌లో ఈ చిన్న రంధ్రం ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? అసలు దాన్ని ఎందుకు పెడతారు?

వాష్‌బేసిన్‌ గురించి మనకు అందరికి తెలిసిన విషయమే.. దీన్ని మన ఇంట్లోని కిచెన్, డౌనింగ్‌ హాల్, లేదా బాత్‌రూమ్‌లో యూజ్‌ చేస్తూ ఉంటాం. అయితే దీన్ని మీరు వాష్‌బేసిన్‌ను కొంచెం నిషితంగా గమనిస్తే అందులో ట్యాబ్‌కంటే కొద్దిగా కింద మనకు ఒక బ్లాక్‌ హోల్‌ వంటిది కనిపిస్తుంది. ఈ ఆ రంద్రం ఏంటో మీకు తెలుసా? దాన్ని ఎందుకు పెడతారో మీరు ఎప్పుడైనా అలోచించారా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

వాష్ బేసిన్‌లో ఈ చిన్న రంధ్రం ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? అసలు దాన్ని ఎందుకు పెడతారు?
Washbasin Overflow Hole

Updated on: Aug 26, 2025 | 5:50 PM

మన ఇంట్లోని వంటగదిలో ఉండే సింక్‌ల మాదిరిగానే, ప్రతి ఇంటి బాత్రూమ్, డైనింగ్ హాల్‌లో వాష్ బేసిన్ ఉంటాయి.హోటళ్ళు, రెస్టారెంట్లలో కూడా ఈ వాష్ బేసిన్‌లు ఉంటాయి. అయితే మనం నిత్యం ఉపయోగించే వాష్ బేసిన్‌లో కరెక్ట్‌గా ట్యాక్‌ కింది భాగంలో ఒక చిన్న రంధ్రం ఉందని.. దీన్ని ఓవర్‌ప్లో రంద్రం అంటారు. ఈ చిన్న రంధ్రం ప్రధాన పని ఏమిటంటే.. వాష్‌బేసిన్‌ నిండిపోయినప్పుడు దానిలోని వాటర్‌ కిందపడిపోకుండా నిరోధించడం. మనం ఎప్పుడైనా అనుకోకుండా ట్యాబ్‌ ఆఫ్‌ చేయడం మర్చిపోయినా, లేదా డ్రెయిన్‌ మూసుకుపోయి వాష్‌బేసిన్‌లో నీరు నిలిచిపోయినా.. ఈ రంధ్రం ఆ నీటిని డ్రైనేజీ వ్యవస్థలోకి మళ్లిస్తుంది. దీనివల్ల నీరు నేలపై పడిపోకుండా, ఇల్లు లేదా బాత్రూమ్ నీరు పడిపోడకుండా చూస్తుంది.

ఈ ఓవర్‌ప్లో హోల్‌ చేసే మరో పని ఏమిటంటే.. ఇది వాష్ బేసిన్ నుండి నీటిని వేగంగా బయటకు పంపడంలో సహాయపడుతుంది. వాష్ బేసిన్‌ నీటి అవుట్‌లెట్ నుండి గాలి సరిగ్గా రానప్పుడు.. ఈ చిన్న రంధ్రం ద్వారా నీటి పారుదల వ్యవస్థలోకి గాలి వెళ్తుంది. ఇది నీటి ప్రవాహాన్ని నెమ్మదింపజేసే వాక్యూమ్ ప్రభావాన్ని తొలగిస్తుంది. ఫలితంగా, నీరు త్వరగా, పైప్‌లైన్‌ ద్వారా బయటకు పోతుంది. దీని ద్వారా బేసిన్‌లో నీరు నిలవకుండా ఉంటుంది.

నీరు కౌంటర్‌టాప్ లేదా నేలపైకి వచ్చినప్పుడు, ఆ ప్రాంతంలో తేమ పెరుగుతుంది. ఇది స్టెయిన్ బ్యాక్టీరియాను పెంచుతుంది. అదే వాస్‌బేసిన్‌కు ఓవర్‌ఫ్లో హోల్ ఉంటే, నీరు కౌంటర్‌టాప్ లేదా నేలపైకి రాకుండా నివారిస్తుంది. ఈ రంధ్రం నీటి స్తబ్దతను తగ్గించడంలో సహాయపడుతుంది. మన ఇంట్లో చిన్నపిల్లలు, వృద్దులు ఉన్నప్పుడు ఈ చిన్న రంధ్రం గల వాష్ బేసిన్ చాలా సురక్షితమైనదిగా ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు వారు వాష్‌బేసిన్‌లోని ట్యాబ్‌ను ఆపివేయడం మర్చిపోతారు. అప్పుడు వాష్‌బేసిన్ నిండి నీరు నేలపైకి వచ్చే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో, ఈ ఓవర్‌ఫ్లో రంధ్రం నీరు నేలపైకి ప్రవహించకుండా నిరోధిస్తుంది.

మరిన్ని హ్యూమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.