Vastu Tips: ఇంట్లో లాఫింగ్‌ బుద్ధ పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా.?

|

Dec 02, 2023 | 7:06 PM

ఇలాంటి వస్తువుల్లో లాఫింగ్ బుద్ధా ఒకటి. ఇంట్లో లాఫింగ్ బుద్ధను పెట్టుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు. అయితే లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో పెట్టుకోవడం వల్ల లాభం ఉన్నట్లే, సరైన దిశలో పెట్టకపోతే నష్టాలు ఉంటాయని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంతకీ లాఫింగ్ బుద్ధను ఎక్కడ పెడితే ఎలాంటి ఫలితం ఉంటుంది.? అసలు ఈ లాఫింగ్‌ బుద్ధ అంటే ఏంటి.?

Vastu Tips: ఇంట్లో లాఫింగ్‌ బుద్ధ పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా.?
Laughing Buddha
Follow us on

వాస్తు శాస్త్రంలో ప్రతీ వస్తువుకు ప్రాధాన్యత ఉంటుంది. ఇంట్లో ఏర్పాటు చేసుకునే కొన్ని వస్తువుల కారణంగా ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడింది. వాస్తును అనుసరించి ఇంట్లో కొన్ని రకాల వస్తువులను ఏర్పాటు చేసుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తుంటారు.

ఇలాంటి వస్తువుల్లో లాఫింగ్ బుద్ధా ఒకటి. ఇంట్లో లాఫింగ్ బుద్ధను పెట్టుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు. అయితే లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో పెట్టుకోవడం వల్ల లాభం ఉన్నట్లే, సరైన దిశలో పెట్టకపోతే నష్టాలు ఉంటాయని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంతకీ లాఫింగ్ బుద్ధను ఎక్కడ పెడితే ఎలాంటి ఫలితం ఉంటుంది.? అసలు ఈ లాఫింగ్‌ బుద్ధ అంటే ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

జపాన్‌కు చెందిన హోతాయ్‌ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. కఠోర తపస్సు చేయడం ద్వారా జ్ఞానోదయం పొందాడు. జ్ఞానం సంపాదించిన తర్వాత హొతాయ్ బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టాడు. జీవితంలో ప్రజలను నవ్వించడానికే పని చేస్తానని నిర్ణయించుకున్నాడు. హొతాయ్ అనేక దేశాలు పర్యటించాడు. అతడు ఎక్కడికి వెళ్లినా ప్రజలను నవ్విస్తూ, వారి జీవితాల్లో ఆనందాన్ని నింపాడు. అందుకే లాఫింగ్ బుద్ధ అనే పేరు వచ్చింది.

లాఫింగ్‌ బుద్ధ అంటేనే ఆనందానికి చిహ్నంగా భావిస్తారు. లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. అలాగే ఇంట్లో నెగిటివిటీ తొలగిపోతుంది. ఫలితంగా ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. లాఫింగ్‌ బుద్ధ విగ్రహం ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా ఉండాలి. తూర్పు వైపున లాఫింగ్ బుద్దుని పెట్టడం శుభప్రదం. ఆఫీస్‌ డెస్క్‌ మీద పెట్టుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది. దీంతో ఉద్యోగంలో రాణిస్తార. వ్యాపార స్థలంలో లాఫింగ్ బుద్ధను పెట్టుకోవడం వల్ల వ్యాపారం క్రమంగా మెరుగుపడుతుంది.

ఇక బంగారు నాణేలు మోస్తున్న లాఫింగ్ బుద్ధ విగ్రహానికి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదని వాస్తు పండితులు చెబుతున్నార. బంగారు రంగులో ఉండే లాఫింగ్‌ బుద్ధను ఏర్పాటు చేసుకుంటే ప్రతికూల శక్తులను నిరోధించవచ్చు. లాఫింగ్‌ బుద్ధను నేలమీద అస్సలు పెట్టకూడదు. తరచుగా చూసే ప్రదేశాల్లోనే పెట్టుకోవాలి. పూజా స్థానంలో కూడా ఉంచకూడదు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..