Facts: ప్రపంచంలో అత్యంత పురాతన కంపెనీ ఏంటో తెలుసా.? ఏ వ్యాపారం చేస్తుంది..

|

Sep 27, 2024 | 1:45 PM

ప్రపంచంలో అత్యంత పురాతన కంపెనీల్లో జపాన్‌కు చెందిన కొంగో గుమి మొదటి స్థానంలో ఉంది. ఈ సంస్థ 578 ఏడీలో స్థాపించారు. ఈ కంపెనీ భవన నిర్మాణాలను చేపడుతుంది. ఈ కంపెనీ ఏర్పాటు చేసి ఏకంగా 1400 ఏళ్లు గడించింది. ఈ కంపెనీని కొరియన్ బిల్డర్ షిగెమిషు కాంగో ఏర్పాటు చేశారు . ఈ సంస్థ 2 ప్రపంచ యుద్ధాలు , అనేక మంది పాలకులు , బ్రిటిష్ బానిసత్వంతో...

Facts: ప్రపంచంలో అత్యంత పురాతన కంపెనీ ఏంటో తెలుసా.? ఏ వ్యాపారం చేస్తుంది..
Oldest Compnay
Follow us on

‘సిన్స్‌ 100 ఇయర్స్‌’.. ఇలాంటి ట్యాగ్‌లైన్స్‌ను మనం చూసే ఉంటాం. ఏదైనా కంపెనీ గొప్పతనాన్ని ఆ సంస్థ ఎప్పుడు ఏర్పాటు చేశారన్న దాని బట్టే తెలుసుకుంటారు. కంపెనీ ఎక్కువ రోజులు చలామణీలో ఉంటే ఆ కంపెనీకి మార్కెట్లో అంత ఆదరణ ఉందని అర్థం. మరి ప్రపంచంలో అత్యంత పురాతన కంపెనీ ఏదో తెలుసా.? ఈ కంపెనీ ఏకంగా 1400 ఏళ్లు గడించింది. ఇంతకీ ఏంటా కంపెనీ.? ఈ కంపెనీ ఏం తయారు చేస్తుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచంలో అత్యంత పురాతన కంపెనీల్లో జపాన్‌కు చెందిన కొంగో గుమి మొదటి స్థానంలో ఉంది. ఈ సంస్థ 578 ఏడీలో స్థాపించారు. ఈ కంపెనీ భవన నిర్మాణాలను చేపడుతుంది. ఈ కంపెనీ ఏర్పాటు చేసి ఏకంగా 1400 ఏళ్లు గడించింది. ఈ కంపెనీని కొరియన్ బిల్డర్ షిగెమిషు కాంగో ఏర్పాటు చేశారు . ఈ సంస్థ 2 ప్రపంచ యుద్ధాలు , అనేక మంది పాలకులు , బ్రిటిష్ బానిసత్వంతో పాటు 2 అణు బాంబు దాడులను ఎదుర్కొంది. ఈ కంపెనీ ఇప్పటికీ సేవలు అందిస్తోంది. ఈ సంస్థ చరిత్రను పరిశీలిస్తే, కాంగో గుమి జపాన్‌లో అనేక దేవాలయాలు, ప్యాలెస్‌లను నిర్మించింది.

ప్రపంచంలో రెండో అతి పురాతన కంపెనీల్లో మారుబేని కార్పొరేషన్ నిలిచింది. ఈ కంపెనీ జపాన్‌కు చెందిన దీనిని 1643లో ఏర్పాటు చేశారు. మారుబేని కార్పొరేషన్ అనేది వివిధ రంగాలలో పనిచేసే వ్యాపార సమూహం. ఇక భారత దేశానికి వస్తే కిర్లోస్కర్ బ్రదర్స్‌ను 1888లో స్థాపించారు. ఈ కంపెనీలు పంపులు, ఇంజన్ల తయారీకి పెట్టింది పేరు. ఇక భారత్‌లో రెండో పురాతన కంపెనీ వోల్టాస్‌. ఈ కంపెనీని 1850లో ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ ఎయిర్‌ కండిషన్లరు, రిఫ్రిజిరేటర్ల వంటివి తయారు చేస్తుంది. గోద్రెజ్ కంపెనీని 1894లో స్థాపించారు. గోద్రెజ్‌ కంపెనీ సబ్బులు మొదలు ఎన్నో రకాల గృహోపకరణలకు సంబంధించిన ప్రొడక్ట్స్‌ను తయారు చేస్తుందన్న విషయం తెలిసిందే.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..