Dream: నిద్రలో ఇలాంటి కలలు వస్తున్నాయా.? దేనికి సంకేతమో తెలుసా.?

|

Oct 26, 2024 | 8:16 AM

మనలో ప్రతీ ఒక్కరికీ కలలు రవడం సర్వసాధారణం. అయితే మనకు వచ్చే ప్రతీ కలకు ఒక అర్థం ఉంటుందని పండితులు చెబుతున్నారు. కలలో కనిపించే కొన్ని అంశాలు మన నిజ జీవితాన్ని ప్రభావితం చేస్తుందని అంటున్నారు. ఇంతకీ కలలో కనిపించే అంశాలు ఎలాంటి అర్థాలను సూచిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Dream: నిద్రలో ఇలాంటి కలలు వస్తున్నాయా.? దేనికి సంకేతమో తెలుసా.?
Dream
Follow us on

కలలు రావడం సర్వసాధారణం. మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కలలు వస్తూనే ఉంటాయి. అయితే మన ప్రమేయం లేకుండానే వచ్చే కలలు మన నిజ జీవితంపై ప్రభావం చూపుతాయని మానసిక నిపుణులు పండితులు చెబుతుంటారు. మనకు వచ్చే ఒక్కో కలకు ఒక్కో రకమైన అర్థం ఉంటుందని అంటుంటారు. కలలో కనిపించే కనిపించే అంశాలు జీవితాలను ప్రభావితం చేస్తాయని విశ్వసిస్తుంటారు. మరి సహజంగా మనకు నిద్రలో వచ్చే కొన్ని కలలు ఏంటి.? వాటి అర్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* కలలో మిమ్మల్ని ఎవరైనా వెంటాడుతున్నట్లు కనిపిస్తే మీరు ఒత్తిడితో ఉన్నారని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మీరు పరిగెడుతున్నట్లు కలలు వస్తే ఏదో తీవ్రమైన సమస్యలో మీరు ఉన్నారని అర్థం.

* కలలో పక్షులు కనిపిస్తే మంచికి సంకేతమని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా పక్షులు ఎగురుతున్నట్లు కనిపిస్తే మీరు జీవితంలో విజయ శిఖరాలకు చేరుకుంటున్నారని అర్థం చేసుకోవాలి.

* మనలో చాలా మందికి ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడుతున్నట్లు కలలు వస్తుంటాయి. ఇది ప్రతికూల ప్రభావానికి సంకేతంగా భావించాలని నిపుణులు అంటున్నారు. ఇలాంటి కలలు వస్తే మీరు క్లిష్టమైన సమస్యను ఎదుర్కోబోతున్నారని అర్థం.

* ఒకవేళ కలలో నీరు కనిపిస్తే రెండు రకాల అర్థాలు ఉంటాయి. నిశ్చలమైన నీరు కనిపిస్తే మీ మన్సు ప్రశాంతంగా ఉందని అర్థం చేసుకోవాలి. అయితే గందగరోళంగా ఉన్న నీరు, లేదా బురద నీరు కనిపిస్తే మాత్రం మీ ఆలోచనలు అస్థిరంగా ఉన్నాయని అర్థం.

* దంతాలు రాలిపోతున్నట్లు కలలో కనిపిస్తే మీరు ఆత్మ విశ్వాసం కోల్పోతున్నారని అర్థం చేసుకోవాలి. జీవితంలో ఏదో కోల్పోబోతున్నారని ఈ కల మనల్ని అలర్ట్‌ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

* ఇక మరణం అనగానే మనం నెగిటివ్‌గా భావిస్తాం కానీ.. కలలో మరణించినట్లు కనిపిస్తే మాత్రం మంచికి సంకేతమని అంటున్నారు. ఇలాంటి కల కనిపిస్తే మీ జీవితంలో ఒక అధ్యాయం ముగియబోతోందని అర్థం చేసుకోవాలి. కొత్త కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందని అర్థం.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితులు, శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..