Dream: కలలో ఈ కలర్‌ పాము కనిపించిందా.. దేనికి సంకేతమో తెలుసా.?

|

Jul 06, 2024 | 7:04 PM

కలలో సర్వసాధారణంగా కనిపించే అంశాల్లో పాము ఒకటి. మనలో చాలా మందికి రాత్రి పడుకున్న సమయంలో కలలో పాము కనిపిస్తుంటుంది. అయితే పాము కనిపించడానికి ఎన్నో కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ పాము రంగు బట్టి అర్థం మారుతుందని అంటున్నారు. ఇంతకీ కలలో ఏ రంగు పాము కనిపిస్తే, ఎలాంటి అర్థానికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం..

Dream: కలలో ఈ కలర్‌ పాము కనిపించిందా.. దేనికి సంకేతమో తెలుసా.?
Snake In Dream
Follow us on

రాత్రి పడుకున్న సమయంలో కలలు రావడం సర్వసాధారణమైన విషయం. అయితే మన ప్రమోయం లేకుండా వచ్చే కలలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని పండితులు చెబుతుంటారు. కేవలం ప్రండితులు మాత్రమే కాకుండా మానసిక నిపుణులు సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తుంటారు. మనకు వచ్చే కలలు మన ఆలోచనలకు ప్రతిరూపాలుగా మానసిక నిపుణులు చెబుతుంటారు.

కలలో సర్వసాధారణంగా కనిపించే అంశాల్లో పాము ఒకటి. మనలో చాలా మందికి రాత్రి పడుకున్న సమయంలో కలలో పాము కనిపిస్తుంటుంది. అయితే పాము కనిపించడానికి ఎన్నో కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ పాము రంగు బట్టి అర్థం మారుతుందని అంటున్నారు. ఇంతకీ కలలో ఏ రంగు పాము కనిపిస్తే, ఎలాంటి అర్థానికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం..

* కలలో నల్లటి పాము కనిపిస్తే మీ మానసిక స్థితికి చిహ్నంగా చెబుతుంటారు. మీలోని అంతర్గత చీకటికి చిహ్నంగా భావించాలని పండితులు చెబుతున్నారు. నల్ల పాము కనిపిస్తే మీకు భవిష్యత్తుల్లో వచ్చే ప్రమాదాలను సూచిస్తుందని అంటున్నార.

* కలలో ఎర్రపాటు కనిపిస్తే శక్తికి చిహ్నంగా భావించాలి. ఈ పాము కనిపిస్తే జీవితంలో మరింత బాధ్యత వహించాలని సూచిస్తుంటారు. మీరు చేసే పనులపై మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

* ఒకవేళ కలలో ఆకుపచ్చ పాము కనిపిస్తే మీ ఆరోగ్యం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

* కలలో గులాబీ రంగు కనిపిస్తే ఆనందం, ప్రేమకు సూచికగా చెబుతుంటారు. మహిళల ద్వారా లాభం పొందే అవకాశం ఉంటుందని అంటున్నారు.

* ఒకవేళ కలలో నీలి రంగు పాము కనిపిస్తే మంచికి సూచనగా భావించాలని చెబుతున్నారు. ఇది మీ జీవితంలో ఏదో మంచి జరుగుతుందని సూచిస్తుంది. సృజనాత్మకత, తెలివితేటలకు చిహ్నంగా చెబుతుంటారు. నీలం రంగు పాము కనిపిస్తే ఏదో మంచి జరగబోతోందని అర్థం చేసుకోవాలి.

* పసుపు రంగు పాము కనిపిస్తే మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం అంతే సవ్యంగానే ఉన్నా ఏదో నష్టం జరిగే అవకాశాలుంటాయని తెలుసుకోవాలి.

* కలలో సహజంగా కనిపించే పాముల్లో శ్వేత నాగు ఒకటి. తెల్లటి పాము కనిపిస్తే మీరు ఏదో రహస్యాన్ని దాచిపెడుతున్నారని అర్థం. మీ కుటుంబ సభ్యులకు కూడా ఆ నిజాన్ని చెప్పడం లేదని అర్థం చేసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు పండితులు, శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్నిఇంట్రెస్టింగ్ కథనాల కోసం క్లిక్ చేయండి..