Dream: కలలో మాంసం తింటున్నట్లు కనిపించిందా.? దాని అర్థం ఏంటో తెలుసా..

కలలు రావడం సర్వసాధారణమైన విషయం. మన ప్రమేయం లేకుండా వచ్చే కలలు మన జీవితంపై ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి కలలో మాంసాహారాన్ని తింటున్నట్లు కనిపిస్తే దేనికి సంకేతం. దీనివల్ల మంచి జరుగుతుందా..? చెడు జరుగుతుందా.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Dream: కలలో మాంసం తింటున్నట్లు కనిపించిందా.? దాని అర్థం ఏంటో తెలుసా..
Dream
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 23, 2024 | 12:44 PM

రాత్రి కలలు రావడం సర్వసాధారణమైన విషయం. ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కలలు వస్తుంటాయి. అయితే మన ప్రమేయం లేకుండా నిద్రలో వచ్చే కలలు మన నిజ జీవితాన్న ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతుంటారు. కేవలం పండితులు మాత్రమే కాకుండా స్వప్నశాస్త్రంలో కూడా ఇందుకు సంబంధించిన అంశాలను వివరించారు. మనకు జనరల్‌గా వచ్చే కలల్లో ఒకటి.. మాంసం తింటున్నట్లు కనిపించడం. ఇంతకీ కలలో నాన్‌ వెజ్‌ కనిపిస్తే దేనికే సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒకవేళ కలలో మీరు మాంసాన్ని కట్‌ చేస్తున్నట్లు కనిపిస్తే మంచికి సంకేతంగా భావించాలని అంటున్నారు. వారసత్వం రూపంలో ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మాసం తింటున్నట్లు కలలో కనిపిస్తే నెగిటివ్‌కు అర్థమని నిపుణులుచ ఎబుతున్నారు. ఇలాంటి కల వస్తే ఆత్మీయ స్నేహితులతో గొడవలు జరిగే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలని చెబుతున్నారు.

అదే ఒకవేళ కలలో కుళ్లిన మాసం కనిపిస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడబోతోందని అర్థం చేసుకోవాలి. ఇక మహిళలకు కోడి మాసం తింటున్నట్లు కల వస్తే శుభసూచికంగా భావించాలని చెబుతున్నారు. పంది మాంసం కనిపిస్తే మీరు అక్రమ మార్గంలో డబ్బు సంపాదిస్తున్నారని అర్థం చేసుకోవాలి. కలలో వండని మాంసాన్ని చూస్తే.. దీర్ఘకాలికంగా రావాల్సిన ధనం తిరిగి రావడంలో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అంటున్నారు.

అప్పుడే మాంసాన్ని వండుకొని వెంటనే తింటున్నట్లు కల వస్తే శుభ సూచికగా భావించాలని నిపుణులు అంటున్నారు. మరీ ముఖ్యంగా స్నేహితులతో కలిసి నాన్‌ వెజ్‌ తింటున్నట్లు కలలో కనిపిస్తే మంచికి సూచికగా భావించాలని అంటున్నారు. ఏదైనా పురోగతికి ఇది సంకేతమని అంటున్నారు. ఇలా కలలో మాంసం కనిపించే ఒక్కో తీరుకు ఒక్కో రకమైన అర్థం ఉంటుందని స్వప్నశాస్త్రం చెబుతోంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితులు, స్వప్నశాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి…