Dream: కలలో దీపం కనిపిస్తే దేనికి సంకేతమో తెలుసా.?

|

Apr 04, 2024 | 7:00 PM

రాత్రి పడుకున్న తర్వాత కలలు రావడం సర్వసాధారణం. మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కల వస్తుంది. అయితే శాస్త్రం ప్రకారం, అలాగే డ్రీమ్‌ సైన్స్ ప్రకారం మనకు వచ్చే ప్రతీ కలకు ఒక అర్థం ఉంటుంది. మనకు రాత్రుళ్లు వచ్చే కలలు నిజ జీవితాన్ని ప్రభావితం చేస్తాయని చెబుతుంటారు. డ్రీమ్‌ సైన్స్‌ ప్రకారం ఒక్కో కలకు ఒక్కో అర్థం ఉంటుంది...

Dream: కలలో దీపం కనిపిస్తే దేనికి సంకేతమో తెలుసా.?
Dream
Follow us on

రాత్రి పడుకున్న తర్వాత కలలు రావడం సర్వసాధారణం. మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కల వస్తుంది. అయితే శాస్త్రం ప్రకారం, అలాగే డ్రీమ్‌ సైన్స్ ప్రకారం మనకు వచ్చే ప్రతీ కలకు ఒక అర్థం ఉంటుంది. మనకు రాత్రుళ్లు వచ్చే కలలు నిజ జీవితాన్ని ప్రభావితం చేస్తాయని చెబుతుంటారు. డ్రీమ్‌ సైన్స్‌ ప్రకారం ఒక్కో కలకు ఒక్కో అర్థం ఉంటుంది. మరి కలలో దీపం కనిపిస్తే దేనికి అర్థమో ఇప్పుడు తెలుసుకుందాం..

* కలలో మీరు లేదా మరెవరైనా దీపం వెలిగిస్తున్నట్లు కనిపిస్తే.. మంచి సంకేతంగా భావించాలని చెబుతున్నారు. మీ జీవితంలో సానుకూల మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు అర్థం. పెళ్లికానీ వారికి త్వరలోనే పెళ్లి జరగనుందని, ఉద్యోగం లేని వారికి త్వరలోఏ ఉద్యోగం రానుందని అర్థం.

* అయితే కలలో ఆరిపోయిన దీపం కనిపిండచం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ఇలా కనిపిస్తే మీరు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని అర్థం. మీకు సమాజంలో తగిన గౌరవం లభించడం లేదని, సంకల్ప శక్తిని కోల్పోతున్నారని అర్థం చేసుకోవాలి.

* ఇక ఒకవేళ కలలో మీరు దీపాన్ని ఆర్పివేస్తున్నట్లు కనిపిస్తే.. మీకు ఆరోగ్య సంబంధిత సమస్య రాబోతుందనడానికి సంకేతం లేదా మీకు దగ్గరగా ఉన్నవారు పెద్ద ప్రమాదంలో పడవచ్చని చెబుతోంది. మీ దగ్గరి వ్యక్తి ఎవరో మరణించనున్నారు అనడానికి కూడా ఇది సూచికగా చెబుతున్నారు.

* దీపం ధగధగ వెలుగుతున్నట్లు కనిపిస్తే ఏదో ఊహించని లాభం జరనుందని అర్థం. ఒకవేళ దీపం క్రమంగా వెలుగు తగ్గిపోతున్నట్లు కనిపిస్తే భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే సూచనలు వున్నట్లు గుర్తించాలి.

* కలలో దీపం మండుతూ కిందపడి పోతున్నట్లు కనిపిస్తే అపాయకరమైన పరిస్థితులు ఎదురవుతాయని శాస్త్రం చెబుతోంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు పండితులు, శాస్త్రాల్లో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే, ఇందులో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..