Lakshadweep : లక్షద్వీప్ భౌతిక స్వరూపాన్ని, వాతావరణాన్ని పూర్తిగా తలకిందులు చేసే విధానమది : ప్రధానికి మాజీ ఐఎఎస్ ల లేఖాస్త్రం

లక్షద్వీప్ పరిణామాలపై తీవ్రమైన ఆందోళన చెందుతూ ఈ లేఖ రాస్తున్నామని..

Lakshadweep :  లక్షద్వీప్ భౌతిక స్వరూపాన్ని, వాతావరణాన్ని పూర్తిగా తలకిందులు చేసే విధానమది : ప్రధానికి మాజీ ఐఎఎస్ ల లేఖాస్త్రం
Lakshadweep

Updated on: Jun 07, 2021 | 12:48 AM

Ex-Bureaucrats Write To PM : లక్షద్వీప్‌లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న పరిణామాలపై 93 మంది విశ్రాంత ఐఏఎస్ అధికారులు ప్రధానికి లేఖ రాశారు. ఇటీవల లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వాళ్లు ఈ లేఖాస్త్రం సంధించారు. లక్షద్వీప్ పరిణామాలపై తీవ్రమైన ఆందోళన చెందుతూ ఈ లేఖ రాస్తున్నామని వాళ్లు ప్రధానికి విన్నవించారు. అడ్మినిస్ట్రేటర్ రూపొందించిన ముసాయిదాలో లక్షద్వీప్ వాసుల నీతి, ప్రయోజనాలకు విరుద్ధమైన నిర్ణయాలు ఉన్నాయని వాళ్లు తమ లేఖలో పేర్కొన్నారు.

అడ్మినిస్ట్రేటర్ రూపొందించిన ముసాయిదాలో ప్రతి అంశం కూడా లక్షద్వీప్ భౌతిక స్వరూపాన్ని, వాతావరణాన్ని పూర్తిగా తలకిందులు చేసే విధంగా ఉండడంతో పాటు ఏకపక్ష విధానంగా కొనసాగిందని వాళ్లు ప్రధానికి వివరించే ప్రయత్నం చేశారు.

ముసాయిదాను రూపొందించే సమయంలో లక్షద్వీప్ ప్రజలను కానీ, అక్కడి సమాజాన్ని కానీ సంప్రదించలేదని మాజీ ఐఏఎస్‌లు వెల్లడించారు. తమకు ఏ పార్టీతో సంబంధం లేదన్న విశ్రాంత ఐఎఎస్ లు.. తాము ఏ పార్టీ సభ్యులం కాదని, తమకు కేవలం రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నవాళ్లమని ఆ లేఖలో పేర్కొన్నారు.

Read also : Sharmila : ‘సారూ.. ! చేతకాకనా? ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? ఇంకెన్నాళ్లు దొరా మూత‌కండ్ల‌ ప‌రిపాల‌న‌..?’ : షర్మిల