Hyderabad: రెండు రూపాయలకే రుచికరమైన బిర్యాని.. కానీ కండీషన్స్ అప్లై..

|

Dec 11, 2023 | 1:28 PM

మనకు వీకెండ్ వచ్చిందంటే చాలు ఏదో ఒక రెస్టారెంట్ వెళ్లి బిర్యానీ తిందాం అని ప్లాన్ చేస్తారు ఫుడ్ లవర్స్. అందులో భాగంగా ఎక్కడ ఏ బిరియానీ స్పెషల్, వాటి ధరలెంత అనే దానిపై తెగ సర్చ్ చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వారికోసం అతి తక్కువ ధరలో బిర్యానీని అందించేందుకు సిద్దమైంది ఈ రెస్టారెంట్. దీని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి బిర్యానీ తినాలంనుకుంటే హైదరాబాద్‎లో నాయుడు గారి కుండ బిర్యానీ కి వెళ్లండి.

Hyderabad: రెండు రూపాయలకే రుచికరమైన బిర్యాని.. కానీ కండీషన్స్ అప్లై..
Biriyani Special Offer
Follow us on

మనకు వీకెండ్ వచ్చిందంటే చాలు ఏదో ఒక రెస్టారెంట్ వెళ్లి బిర్యానీ తిందాం అని ప్లాన్ చేస్తారు ఫుడ్ లవర్స్. అందులో భాగంగా ఎక్కడ ఏ బిరియానీ స్పెషల్, వాటి ధరలెంత అనే దానిపై తెగ సర్చ్ చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వారికోసం అతి తక్కువ ధరలో బిర్యానీని అందించేందుకు సిద్దమైంది ఈ రెస్టారెంట్. దీని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి బిర్యానీ తినాలంనుకుంటే హైదరాబాద్‎లో నాయుడు గారి కుండ బిర్యానీ కి వెళ్లండి. ఇక్కడ కేవలం రెండు రూపాయలకే మంచి రుచికరమైన బిర్యానీ అందిస్తున్నారు. అదేంటి రెండు రూపాయలకు మంచి నీళ్లు కూడా రావడంలేదు. అలాంటిది బిర్యానీ ఇస్తారా.. ఏదో తప్పుడు వార్త అనుకుంటే పొరబడినట్లే. నిజంగానే రెండు రూపాయలకు మంచి రుచికరమైన బిర్యానీ అందిస్తున్నారు రెస్టారెంట్ యాజమాన్యం. వీరికి కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి, దిల్‌సుఖ్‌నగర్‌లలో బ్రాంచిలు ఉన్నట్లు తెలిపారు.

హైదరాబాద్ అంటేనే బిర్యానీకి పెట్టింది పేరు. సమయం దొరికినప్పుడల్లా బయటకు వెళ్లే వీలు లేకుంటే ఆన్లైన్లో అయినా ఆర్డర్ పెట్టి తినాలనుకుంటారు. అయితే ఆన్లైన్లో ఏమైన ప్రత్యేకమైన ఆఫర్లు, కూపన్లు ఉన్నాయా అని తెగ వెతుకుతూ ఉంటారు. అవేవీ అవసరం లేకుండా కేవలం రెండు రూపాయలకు వెజ్ లేదా నాన్‌వెజ్ బిర్యానీని రుచి చూడవచ్చు. ఎన్ని మొబైల్ యాప్ కూపన్లు, ఆఫర్లు ఉపయోగించినా ఈ ధరకు మంచి బిర్యానీ అయితే రాదు. అసలు ఇంత తక్కువ ధరకు బిర్యానీని అందించేందుకు గల కారణం ఏంటి అని మీలో అనుమానం రావచ్చు. దీనికి ఒక చిన్న షరతు పెట్టారు రెస్టారెంట్ యాజమాన్యం. ఈ బిర్యానీ పొందాలంటే కేవలం రెండు రూపాయల నోటు తీసుకొని రావాలని చెబుతున్నారు రెస్టారెంట్ యాజమాని జె మనోహర్. ఇప్పటి వరకూ ఈ ప్రత్యేక షరతు ద్వారా బిర్యానీని పొందిన వారు 120 మంది అని చెబుతున్నారు. ఎవరైనా రెండు రూపాయల నోటు తీసుకొస్తే వాళ్ళకు తప్పకుండా వారు కోరిన బిర్యానీ ఇస్తానంటున్నారు. ఎందుకు ఇలాంటి ప్రత్యేకమైన ఆఫర్ అమలు చేస్తున్నారు అని అడిగితే వింతైన సమాధానం ఇచ్చారు. ప్రజల వద్ద రెండు రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ ఆఫర్ ప్రారంభించినట్లు చెప్పారు. ఇప్పటి వరకూ మంచి రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు.

తమ వద్ద కేవలం చికెన్, మటన్, వెజ్ బిర్యానీలే కాకుండా.. ముఘలాయి చికెన్ బిర్యానీ, దిల్‎కుష్ చికెన్ బిర్యానీ, జపనీస్ కమ్‌జు పిట్టా బిర్యానీ, చేపలు, రొయ్యల బిర్యానీలతో సహా పలు రకాల బిర్యానీలు అందుబాటులో ఉన్నాయి అంటున్నారు. ఇప్పటి వరకూ అన్ లిమిటెడ్ బఫెట్లు, అన్ లిమిటెడ్ బ్రేక్ ఫాస్ట్‎లు రుచి చూసి ఉంటారు. అలాగే ప్లేట్ బిర్యానీ రూ. 10కి కూడా తిని ఉంటారు. అయితే ఈ తరహా రెండు రూపాయలకే వివిధ రకాల బిర్యానీలు తిని ఉండరు. ఒక మనిషికి ఒక బిర్యానీ మాత్రమే ఇస్తామంటున్నారు రెస్టారెంట్ నిర్వహకులు. గతంలో ఫుడ్ తినడంపై అనేక పందేలు వేయడం చూసి ఉంటారు. గెలిచిన వారికి ప్రత్యేకమైన బహుమతులు, ఫ్రైజ్ మనీ ఆఫర్లు ప్రకటించడం చూసే ఉంటారు. అయితే రెండు రూపాయలకే బిర్యానీ ఇవ్వడం అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..