Cyclone Tauktae : ఉవ్వెత్తున ముంచుకొస్తోన్న తౌక్టే తుఫాను నేపథ్యంలో అమరావతిలోని వాతావరణ కేంద్రం పలు వాతావరణ సూచనలు వెల్లడించింది. ప్రస్తుతం తూర్పు మధ్య అరేబియా సముద్రం మీద ఉన్న అతి తీవ్ర తుఫాను – తౌక్టే.. గడచిన 06 గంటల్లో గంటకు సుమారు 11 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి, ఈ రోజు – 16 మే, 2021 08.30 గంటలకు – తూర్పు మధ్య అరేబియా సముద్రం దగ్గర Lat 15.3 deg N,/Long 72.7 deg E వద్ద కేంద్రీకృతమైందని తెలిపింది. ఇది గోవా కి పశ్చిమ నైరుతి దిశగా 120 కి. మీ., ముంబై కు దక్షిణ దిశగా 420 కి. మీ, వెరావెల్ (గుజరాత్) కు దక్షిణ ఆగ్నేయ దిశగా 660 కి. మీ. ఇంకా, కరాచీ(పాకిస్తాన్) కి ఆగ్నేయంగా 810 కిమీ దూరంలో ఉందని పేర్కొంది. ఇది మరింత బలపడి రాగల 24 గంటల్లో ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణించి, గుజరాత్ తీరమును 17.05.21 తేదీన సాయంత్రం సమయంలో చేరి, పోరు బందర్ – మహువా (భావ నగర్ జిల్లా) ప్రాంతాల మధ్య 18. 5. 21 తేదీ ఉదయం సమయంలో తీరాన్నీ దాటే అవకాశం ఉందని వెల్లడించింది. పలితంగా కొంకన్, ముంబయి తీర ప్రాంతాల్లో తీవ్రమైన గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, కేరళలో తౌక్టే తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. అనేక తీర ప్రాంత గ్రామాలు భారీ వర్షాలు, సముద్రజలాలతో అతలాకుతలమవుతున్నాయి. జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.
Prayers For the People of Coastal Indian States Facing wrath of #CycloneTauktae and Strength to Centre, State , Forces and NDRF Teams for Preparing and Undertaking Rescue Ops ??pic.twitter.com/D3y9x1IhbD
— Megh Updates ? (@MeghUpdates) May 16, 2021
Read also : Cyclone : ఉప్పాడ సముద్రతీరంలో రోజుకోమార్పు.. నేడు వెనక్కివెళ్లిన బీచ్, నిన్న ఎరుపు, నీలం రంగులో దర్శనం