Viral: నర్సు తప్పిదంతో మారిన శిశువు తల్లిదండ్రులు.. కట్ చేస్తే.. 3 ఏళ్ల తర్వాత కలిశారు.. అసలేం జరిగిందంటే?

|

Jun 12, 2022 | 12:58 PM

2019లో ఇద్దరు గర్భిణులు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. వారిలో ఒకరి బిడ్డ చనిపోయి పుట్టింది. అయితే నర్సు ప్రమాదవశాత్తు ఆ బిడ్డను మరొక మహిళకు అందించింది.

Viral: నర్సు తప్పిదంతో మారిన శిశువు తల్లిదండ్రులు.. కట్ చేస్తే.. 3 ఏళ్ల తర్వాత కలిశారు.. అసలేం జరిగిందంటే?
Child
Follow us on

ఓ జంటకు మూడేళ్ల తర్వాత కొడుకు పుట్టాడు. కానీ, నర్సు తప్పిదంతో పుట్టిన వెంటనే ఆ బిడ్డను కోల్పోయారు. చివరకు మూడేళ్ల తర్వాత డీఎన్‌ఏ పరీక్ష తర్వాత కోర్టు తీర్పుతో బిడ్డను నిజమైన తల్లిదండ్రుల వద్దకు చేర్చింది. ఈ ఘటన అస్సాంలోని బార్‌పేట జిల్లాలో చోటుచేసుకుంది. నజ్మా ఖానుమ్ అనే ఇద్దరు గర్భిణులు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. ఇద్దరికీ ఒకే పేరు ఉండడంతో నర్సు తప్పులో కాలు వేసింది. దీంతో చిన్నారుల విషయంలోనూ తీవ్రమైన అయోమయం ఏర్పడింది.

2019లో నజ్మా ఖాన్ అనే ఇద్దరు గర్భిణులు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. వారిలో ఒకరి బిడ్డ చనిపోయి పుట్టింది. అయితే నర్సు ప్రమాదవశాత్తు బిడ్డను మరొకరి బిడ్డను వేరే జంటకు అందించింది. దీంతో చిన్నారి అసలు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. విచారణ తర్వాత జిల్లా కోర్టు డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని ఆదేశించింది. దీంతోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావించింది. ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత డీఎన్‌ఏ ఫలితాలతో మూడేళ్ల చిన్నారిని నిజమైన తల్లి నజ్మా ఖానుమ్‌కు అప్పగించాలని శుక్రవారం ఆదేశించింది.

ఖానుమ్ మార్చి 3, 2019న ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మెడికల్ కాలేజీలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత ఆమెను ఐసీయూలో ఉంచి, అప్పుడే పుట్టిన బిడ్డను బేబీ రూమ్‌లో ఉంచారు. మరుసటి రోజు ఆసుపత్రి నిర్వాహకులు మీ కుమారుడు చనిపోయాడని ఖనుమ్ భర్తకు తెలియజేశారు. పుట్టినప్పుడు తమ కొడుకు ఆరోగ్యంగా ఉన్నాడంటూ బార్‌పేట సదర్ పోలీస్ స్టేషన్‌లో ఆసుపత్రిపై కేసు పెట్టారు.

ఇవి కూడా చదవండి

నర్సు తప్పిదంతో..

విచారణలో, గోసాయిగావ్‌కు చెందిన నజ్మా ఖాతూన్ తన నవజాత శిశువును అదే రోజు చాలా తీవ్రమైన స్థితిలో అదే ఆసుపత్రిలో జాయిన్ చేసింది. అయితే, అదే రోజు ఆ చిన్నారి మరణించినట్లు పోలీసులు గుర్తించారు. డ్యూటీలో ఉన్న నర్సు ఇద్దరు శిశువులను చేరదీసి, చనిపోయిన బిడ్డను నజ్మా ఖానుమ్ భర్తకు అప్పగించింది. కోర్టు ఆదేశాల మేరకు నవజాత శిశువు నిజమైన తల్లిదండ్రులు డీఎన్‌ఏ పరీక్ష ద్వారా నిర్ణయించారు. దీంతో ఈ సమస్యకు చివరకు ఫుల్ స్టాప్ పడింది.