Hair Care: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి పాలు..! ఈ సింపుల్ టిప్స్ తో జుట్టుకు నేచురల్ ట్రీట్‌మెంట్..!
కొబ్బరి పాలు జుట్టు ఆరోగ్యం కోసం అత్యద్భుతమైన సహజ పరిష్కారంగా మారాయి. అవి జుట్టుకు తేమ, పోషణను అందించడమే కాకుండా.. జుట్టు రాలిపోవడం ఆపేందుకు అలాగే బాగా పెరిగేందుకు సహాయపడతాయి. ఈ రోజుల్లో చాలా మందికి జుట్టు రాలిపోవడం, పొడిబారడం, తెల్లజుట్టు, చుండ్రు వంటి జుట్టు సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి కొబ్బరి పాలు మంచి పరిష్కారం.
![Hair Care: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి పాలు..! ఈ సింపుల్ టిప్స్ తో జుట్టుకు నేచురల్ ట్రీట్‌మెంట్..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/coconut-milk-benefits.jpg?w=1280)
కొబ్బరి పాలలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. దీనిని ఉపయోగించడం చాలా సులభం. కొబ్బరి పాలను కొద్దిగా వేడి చేసి దీన్ని తలపై మసాజ్ చేస్తే రక్తప్రసరణ పెరిగి పోషకాలు జుట్టు మూలాలకి చేరుకుంటాయి. 25-30 నిమిషాల పాటు ఈ ప్యాక్‌ను ఉంచి తేలికపాటి షాంపూతో వాష్ చేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.
కొబ్బరి పాలు, మెంతులు
మెంతులు, కొబ్బరి పాలు కలిసి ఉపయోగించడం. రాత్రంతా నీటిలో నానబెట్టి, మెంతుల్ని మెత్తగా చేసి అందులో కొబ్బరి పాలు జోడించి జుట్టు, తలకు పట్టించండి. 30-40 నిమిషాలు ఉంచిన తర్వాత శుభ్రంగా తలస్నానం చేయండి. ఇది జుట్టును బలపరచడంలో సహాయపడుతుంది.
కొబ్బరి పాలు, తేనె
కొబ్బరి పాలు, తేనెను కలిపి ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయడం కూడా మంచిది. తేనెలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, మాయిశ్చరైజింగ్ లక్షణాలు జుట్టును పోషిస్తాయి. అలాగే జుట్టు రాలిపోవడం ఆపేస్తాయి. 20-30 నిమిషాల పాటు ఉంచి తేలికపాటి షాంపూతో కడిగేస్తే.. మంచి ఫలితాలు వస్తాయి.
కొబ్బరి పాలు, అలోవెరా
కొబ్బరి పాలను అలోవెరా తో కలిపి జుట్టు, తలకు అప్లై చేయండి. ఇది చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది. జుట్టును బలంగా పెంచుతుంది.
అరటిపండు, కొబ్బరి పాలు
పండిన అరటిపండు, కొబ్బరి నూనె మిశ్రమాన్ని కలిపి కొబ్బరి పాలు జోడించి జుట్టు మీద అప్లై చేయండి. ఈ ప్యాక్ జుట్టుకు మృదువుగా, సిల్కీగా మారడానికి సహాయపడుతుంది.
కొబ్బరి పాలు, పెరుగు
కొబ్బరి పాలు, పెరుగు, కర్పూరం కలిపి జుట్టుకు మసాజ్ చేస్తే, జుట్టు తేమ, పోషణను పొందుతుంది. ఈ మాస్క్ జుట్టుకు సహజ కండీషనర్‌గా పనిచేస్తుంది. ఈ సహజ మాస్క్‌లు జుట్టును ఆరోగ్యంగా, బలంగా ఉంచుతుంది. ఈ కొబ్బరి పాలను వినియోగించడం వలన, జుట్టు సున్నితంగా, సిల్కీగా మారుతుంది.