Man Living: 14 ఏళ్లుగా విమానాశ్రయాన్నే నివాసంగా మార్చుకున్న వృద్ధుడు.. అసలు కారణం తెలిస్తే షాక్!

|

Mar 31, 2022 | 3:58 PM

చైనాలో 60 ఏళ్ల వృద్ధుడు విమానాశ్రయాన్నే నివాసంగా మార్చుకున్నారు. 14 సంవత్సరాలుగా బీజింగ్ క్యాపిటల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్యాంపింగ్ చేస్తున్నారు.

Man Living: 14 ఏళ్లుగా విమానాశ్రయాన్నే నివాసంగా మార్చుకున్న వృద్ధుడు.. అసలు కారణం తెలిస్తే షాక్!
Beijing Capital International Airport Copy
Follow us on

Man Living in Airport:  చైనా(China)లో 60 ఏళ్ల వృద్ధుడు విమానాశ్రయాన్నే నివాసంగా మార్చుకున్నారు. 14 సంవత్సరాలుగా బీజింగ్(Beijing) క్యాపిటల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్యాంపింగ్ చేస్తున్నారు. ఇంట్లో కుటుంబం ఉన్నప్పటికీ అతను తన ఇంటికి వెళ్లడానికి మాత్రం నిరాకరిస్తున్నాడు. ఎయిర్‌పోర్ట్‌లోని వెయిటింగ్ ఏరియాను తన నివాసంగా చేసుకుని ఉంటున్నట్లు స్థానిక అధికారులు గుర్తించారు. వీ జియాంగువో అనే వ్యక్తి.. 2008 నుండి టెర్మినల్-2 లోపల అంతర్జాతీయ విమానాశ్రయంలో నివసిస్తున్నారు. చైనా డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీ మాట్లాడుతూ.. తనకు 40 ఏళ్ల వయసులో ఉద్యోగం నుంచి తొలగించారని, వయసు రీత్యా ఉద్యోగం కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు. ఇంట్లో స్వేచ్ఛ లేనందున వెళ్లడం లేనని వీ చెప్పుకొచ్చాడు.

2017లో క్రిస్మస్ పండుగకు ముందు, విమానాశ్రయ అధికారులు వీని ఇంటికి వెళ్లమని అడిగారు. పోలీసు సిబ్బంది అతనిని బలవంతంగా ఇంటికి తీసుకెళ్లారు. వీ ఇల్లు విమానాశ్రయం నుండి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. పోలీసులు ఇంటికి తీసుకొచ్చిన కొద్దిరోజుల తర్వాత మళ్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. కుటుంబం నుండి దూరం పెరగడంతో అతను విమానాశ్రయం, రైల్వే స్టేషన్లలో రాత్రి గడపడం ప్రారంభించాడని వీ జియాంగువో చెప్పారు. ఇంట్లో స్వేచ్ఛ లేకపోయినా ఎయిర్‌పోర్టులో స్వేచ్ఛగా జీవిస్తున్నానని చెప్పారు

ఇంటికి తిరిగి రావడం గురించి వీ జియాంగువోను అడిగినప్పుడు, అతను ఇంటికి తిరిగి రానని తేల్చి చెప్పాడు. ఎందుకంటే మద్యం, సిగరెట్లను విడిచిపెట్టమని కుటుంబసభ్యులు ఒత్తిడి చేయడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. వీ తన నెలవారీ ప్రభుత్వ పెన్షన్‌తో ఈ వ్యసనాన్ని తీర్చుకుంటాడు. ధూమపానం, మద్యపానం మానేయమని అతని కుటుంబం తనను కోరినట్లు అతను చెప్పాడు. ఇంట్లో ఉండాలంటే స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు మానుకోవాలని కుటుంబసభ్యులు ఒత్తిడి చేశారు. అలా చేయకపోతే, నేను వారికి నెలకు మొత్తం 1000 యువాన్లను ఇవ్వవలసి ఉంటుంది. అప్పుడు నేను నా సిగరెట్లు, మద్యం ఎలా కొనగలను? నేను విమానాశ్రయంలో స్వేచ్ఛగా జీవిస్తున్నాను అంటూ సమాధానం ఇస్తున్నాడు.

Read Also…. Ramdev baba: ‘నేను ఆ మాట అన్నాను. అయితే ఏంటి..? నోర్ముసుకో’.. రిపోర్టర్ పై బాబా రామ్‌దేవ్ ఫైర్